తెలంగాణ

telangana

ETV Bharat / state

YS SHARMILA PROTEST: వైఎస్​ షర్మిల నిరుద్యోగ దీక్షకు అనుమతి నిరాకరణ - వైఎస్​ షర్మిల వార్తలు

వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల.. ఇవాళ్టి నిరుద్యోగ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీక్షాస్థలి వద్ద ఏర్పాట్లును అడ్డుకున్నారు. పార్టీ ప్రారంభం నుంచి ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం పేరిట షర్మిల దీక్ష చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు.

YS SHARMILA PROTEST
YS SHARMILA PROTEST

By

Published : Sep 21, 2021, 5:45 AM IST

సికింద్రాబాద్‌ పిర్జాదిగూడలో వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ(YSRTP) అధ్యక్షురాలు షర్మిల ఇవాళ (YS SHARMILA) చేపట్టదలచుకున్న నిరుద్యోగ దీక్షకు (YS SHARMILA PROTEST)పోలీసులు అనుమతి నిరాకరించారు. దీక్షాస్థలం వద్ద ఏర్పాట్లను అడ్డుకున్నారు. దీనిపై ఆ పార్టీ నేతలు నేతలు కార్యకర్తలు అక్కడే ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

షర్మిల దీక్షను అడ్డుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని.. వైఎస్​ఆర్​టీపీ అధికార ప్రతినిధి సత్యవతి ఆరోపించారు. నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నందుకు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పార్టీ ప్రారంభం నుంచి ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలు చేస్తున్న వైఎస్​ షర్మిల.. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని కోరుతున్నారు.

అక్టోబర్ 20 నుంచి పాదయాత్ర: వైఎస్‌ షర్మిల

ప్రజాప్రస్థానం పేరుతో అక్టోబర్ 20వ తేదీ నుంచి పాదయాత్ర (Praja Prasthanam Padayatra) చేపట్టనున్నట్లు వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YSRTP President YS Sharmila) ప్రకటించారు. నిరుద్యోగ సమస్య (Unemployment problem in telangana) పరిష్కారమయ్యే వరకూ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏడాదిపాటు 90 నియోజకవర్గాల్లో పాదయాత్ర (Praja Prasthanam Padayatra) సాగుతుందని... జీహెచ్​ఎంసీ మినహా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర (Praja Prasthanam Padayatra) చేస్తామని స్పష్టం చేశారు. రోజుకు 12-15 కి.మీ మేర పాదయాత్ర (Praja Prasthanam Padayatra) ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని చేవెళ్లలో ప్రారంభించి... చేవెళ్లలోనే ముగిస్తానని షర్మిల తెలిపారు.

ఇదీచూడండి:YS Sharmila Padayatra: అక్టోబర్ 20 నుంచి షర్మిల పాదయాత్ర.. చేవెళ్లలో ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details