తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP Rally in Hyderabad: 'శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చు.. భాజపా ర్యాలీకి అనుమతి ఇవ్వలేం' - హైదరాబాద్​ జేపీ నడ్డా ర్యాలీ వార్తలు

hyderabad police
hyderabad police

By

Published : Jan 4, 2022, 4:06 PM IST

Updated : Jan 4, 2022, 5:02 PM IST

16:03 January 04

'శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చు.. భాజపా ర్యాలీకి అనుమతి ఇవ్వలేం'

BJP Rally in Hyderabad: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అరెస్ట్ నిరసనగా ఆ పార్టీ తలపెట్టిన ర్యాలీకి అనుమతిలేదని పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. 'ప్రజాస్వామ్య పరిరక్షణ' పేరుతో సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు మౌనంగా ర్యాలీ చేస్తామని భాజపా నేతలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే ర్యాలీలో ఎంతమంది పాల్గొంటారో తెలపలేదన్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం భారీ ర్యాలీకి యత్నిస్తున్నారన్న సమాచారం ఉందని.. ఫలితంగా శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ నిబంధనల మేరకు ఈనెల 10 వరకు ర్యాలీలు, సభలకు అనుమతి లేదని గుర్తుచేశారు. సాయంత్రం వేళ ర్యాలీ తీస్తే ట్రాఫిక్ ఇక్కట్లు కలుగుతాయన్నారు. సికింద్రాబాద్‌లో పలు ఆస్పత్రులు ఉన్నాయని... రోగులు, అంబులెన్స్‌లకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు.

14 రోజులపాటు ర్యాలీలు..

బండి సంజయ్‌ అరెస్టు నేపథ్యంలో 14 రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. ఇవాళ్టి నుంచి జిల్లా, మండల కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ఆ పార్టీ నేతలు సూచించారు. 14 రోజుల పాటు రాష్ట్ర నాయకులతో పాటు .. రోజుకో జాతీయ నాయకుడు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని... భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి తెలిపారు. 317 జీవో సవరణ, నిరుద్యోగం వంటి, రైతు సమస్యలపై పోరాడుతున్న బండి సంజయ్‌పై అక్రమ కేసులు పెట్టడాన్ని పార్టీ ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఇవీచూడండి:

Last Updated : Jan 4, 2022, 5:02 PM IST

For All Latest Updates

TAGGED:

bjp rally

ABOUT THE AUTHOR

...view details