స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర మొత్తం ‘జనగణమన’తో మారుమోగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని అన్ని కూడళ్ల వద్ద ఉదయం 11.30 గంటలకు జాతీయ గీతాలాపన జరిగింది. సాంకేతికత సాయంతో నగరంలో ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు ట్రాఫిక్ పోలీసులు కీలకంగా వ్యవహరించారు.
ఆ సమయానికి రెడ్ సిగ్నల్ పడి జనగణమన గీతం వచ్చేలా ప్రోగ్రామింగ్ - Hyderabad police national anthem
స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పదకొండున్నరకు ఎక్కడివారు అక్కడే నిల్చొని జాతీయగీతం ఆలపించారు. అయితే హైదరాబాద్ పరిధిలో ఆన్‌లైన్‌లో అనుసంధానమైన కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ పడి జనగణమన గీతం వచ్చేలా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రోగ్రాం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది.
డిజిటల్ అనౌన్స్‌మెంట్ సిస్ట్‌మ్‌లో భాగంగా ఆన్‌లైన్ కనెక్టివిటీ ఉన్న అన్ని సిగ్నల్ పాయింట్లలో ‘జనగణమన’ ప్లే అయింది. దీనికోసం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముందస్తుగా ప్రోగ్రాం చేసి 11:29:30 గంటలకు దాన్ని విడుదల చేశారు. తొలుత ‘అందరూ దయచేసి నిలబడండి.. జాతీయ గీతాలాపన చేద్దాం’ అనే సందేశాన్ని వినిపించారు. ఆ తర్వాత రెండు సైరన్లు మోగిన అనంతరం జాతీయ గీతం ప్లే అయింది. మూడు కమిషనరేట్ల పరిధిలో ఆన్‌లైన్‌లో అనుసంధానమైన కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ పడి జనగణమన గీతం వచ్చేలా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రోగ్రాం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: