తెలంగాణ

telangana

ETV Bharat / state

‘రాత్రి కర్ఫ్యూ’లో నగరవాసులు ఇంటికే పరిమితం - రాత్రి కర్ఫ్యూ వార్తలు

లాక్‌డౌన్‌లో పోలీసులని ముప్పు తిప్పలు పెట్టిన ప్రజల్లో ప్రస్తుతం అవగాహన ఏర్పడింది. రాత్రి సమయంలో బయటకు రాకుండా స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటిస్తున్నారు. మొదట్లో రోజుకు 100కు పైగా కేసులు పెట్టేవాళ్లమని.. ప్రస్తుతం నాలుగైదు రోజులుగా సగటున 40 మందికి మాత్రమే జరిమానా విధిస్తున్నట్లు సైబరాబాద్‌కు చెందిన ఓ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

hyderabad police, night kurfew
hyderabad police, night kurfew

By

Published : Apr 24, 2021, 12:15 PM IST

‘రాత్రి కర్ఫ్యూ’లో నగరవాసులు ఇంటికే పరిమితం అవుతున్నారని.. స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటిస్తున్నారని పోలీసులు అంటున్నారు. చాలావరకు ప్రజలు తమకు సహకరిస్తున్నారని తెలిపారు.


శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో నిర్మానుష్యంగా మారిన చార్మినార్‌ ప్రాంతం

లాక్‌డౌన్‌లో మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టారు. అనవసరంగా చాలా మంది రోడ్లపైకొచ్చారు. ఇప్పుడేమో చాలా మంది స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటిస్తున్నారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఇళ్లకే పరిమితమవుతున్నారు.

- ఓ ఇన్‌స్పెక్టర్‌


*అప్పట్లో కాస్త కఠినంగా వ్యవహరించాం. లాఠీలకు కూడా పనిచెప్పాం. ఇప్పుడేమో అలాంటి పరిస్థితి లేదు. చాలా వరకు మాకు సహకరిస్తున్నారు. అవసరమైతేనే బయటికొస్తున్నారు - మరో ఇన్‌స్పెక్టర్‌


*ఈ ఇద్దరే కాదు.. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పరిధిలోని పలువురు ఇన్‌స్పెక్టర్లు ఇదే చెబుతున్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు నగరవాసుల్లో చాలా వరకు మార్పు వచ్చిందంటూ వివరిస్తున్నారు.


వాణిజ్య సముదాయాలపై నజర్‌...
నిబంధనలు పాటించడంలో వాణిజ్య సముదాయాలు, దుకాణాల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాపారం జరిగే సమయం అంటూ రాత్రి 9 దాటిన తర్వాత కూడా తెరిచే ఉంచుతున్నారు. రోజుకు 4 నుంచి 5 కేసులు పెడుతున్నాం’ అంటూ శివారుల్లోని ఓ ఇన్‌స్పెక్టర్‌ వెల్లడించారు.
అప్పటికప్పుడు చలానా
మాస్క్‌ ధరించని వ్యక్తులపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ఉన్నతాధికారులు ప్రత్యేక లింక్‌ను ఇప్పటికే పంపించారు. ఆ లింక్‌ను ఓపెన్‌ చేసి.. అందులో మాస్క్‌ ధరించని వ్యక్తుల ఆధార్‌ నంబర్లు, ఇతరత్రా సమాచారాన్ని నమోదు చేసి రూ.వేయి జరిమానా విధిస్తున్నారు. చలానా‌ చేతికిచ్చి డబ్బులుంటే అప్పటికప్పుడు కట్టిస్తున్నారు. లేదంటే తర్వాత చెల్లించాలని హెచ్చరించి పంపిస్తున్నారు. ‘మొదట్లో రోజుకు 100కు పైగా కేసులు పెట్టేవాళ్లం. ఇప్పుడు చాలా మందికి భయం ఏర్పడి మాస్క్‌ పెట్టుకుంటున్నారు. గత నాలుగైదు రోజులుగా సగటున 40 మందికి రూ.వేయి జరిమానా విధించాం’ అని సైబరాబాద్‌కు చెందిన మరో ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.

ఇదీ చూడండి:వైద్య, ఆరోగ్యశాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details