రోడ్డుపై అచేతనంగా పడి ఉన్న ఓ వ్యక్తికి బాచుపల్లి పోలీసులు సపర్యలు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మెదక్ జిల్లా ఖాజీపల్లికి చెందిన శ్రీశైలం (45) హైదరాబాద్‌కు వచ్చి కాపాలదారుడిగా పనిచేస్తున్నాడు. వారం క్రితం తప్పిపోయి బాచుపల్లికి చేరుకున్నాడు. మతిస్థిమితం కోల్పోయి రేణుకా ఎల్లమ్మకాలనీలో అచేతన స్థితిలో ఉన్నాడు.
అతడిని స్థానికులు గుర్తించి బాచుపల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానిక కార్పొరేటర్, పోలీసులు అక్కడికి చేరుకొని బాధితుడికి స్నానం చేయించారు. మంచి దుస్తులు తొడిగించి అన్నం పెట్టించగా... అతను కొంత స్పృహలోకి వచ్చాడు. కుటుంబీకులకు సమాచారం అందించి బంధువులకు అప్పగించారు.