హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీ గేట్‌కు తాళాలు వేయడంపై విద్యార్థులు మండిపడ్డారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసన చేపట్టడానికి మొజంజాహి మార్కెట్ చౌరస్తాకు విద్యార్థులు వెళ్తారన్న ముందస్తు సమాచారంతో యూనివర్సిటీలోని అన్ని గేట్లకు పోలీసులు తాళాలు వేశారు. తమ సొంత పనుల కోసం క్యాంపస్ బయటకు వెళ్ళలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఇఫ్లూ' గేటుకు తాళం.. విద్యార్థుల అవస్థలు - ఇఫ్లూ యూనివర్సిటీ
హైదరాబాద్ ఇఫ్లూ విశ్వవిద్యాలయం గేట్లకు తాళాలు వేయడం పట్ల విద్యార్థులు ఆగ్రహించారు. సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి విద్యార్థులు హాజరవుతారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు నిర్బంధించారు. తమ సొంత పనులకు కూడా బయటకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇఫ్లూ యూనివర్సిటీకి తాళం వేసిన పోలీసులు
అయితే మొజంజాహి మార్కెట్ చౌరస్తాలోని ఓ బేకరీ వద్ద సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా స్నాక్ విత్ టాక్ అనే కార్యక్రమాన్ని ఓయూ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, యంగ్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో ముందస్తుగా పోలీసులు గేట్లు మూసివేసి నిర్బంధించినట్లు తెలుస్తోంది.