యువతకు ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో నార్త్ జోన్ పోలీసులు, ఐటీ కంపెనీలతో సంయుక్తంగా జాబ్ కనెక్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సీపీ సూచించారు. మూడు వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా దాదాపు 30 కంపెనీలతో జాబ్ కనెక్ట్ ప్రోగ్రాం రూపొందించినట్లు వెల్లడించారు.
'జాబ్ కనెక్ట్‌తో మూడువేల మంది యువతకు ఉపాధి' - హైదరాబాద్ సీపీ వార్తలు
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో నార్త్ జోన్ పోలీసులు ఏర్పాటు చేసిన జాబ్ కనెక్ట్ కార్యక్రమాన్ని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. మూడు వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా జాబ్ కనెక్ట్ ప్రోగ్రాం రూపొందించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సీపీ సూచించారు.
hyderabad cp
నాలుగేళ్లుగా హైదరాబాద్ పోలీసులు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు అంజనీ కుమార్ తెలిపారు. ఏటా రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా వల్ల గతేడాది జాబ్ కనెక్ట్ కార్యక్రమం జరగలేదన్నారు. 2021లో మొదటి జాబ్ కనెక్ట్ కార్యక్రమం ఇదే అని... దీనికి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. వచ్చే రెండు శనివారాల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు.
ఇదీ చదవండి :తెరాస పకడ్బందీ వ్యూహం... గులాబీదే గ్రేటర్ పీఠం!