దిల్లీ హింసాత్మక ఘటనల వీడియోలను ప్రసారం చేయవద్దని జాతీయ మీడియాకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆ వీడియోలు ఇతర ప్రాంతాల్లో శాంతి, భద్రతలకు సవాల్‌గా మారే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరం కలిసి పని చేయాలని అన్నారు.
'నగరవాసులంతా శాంతియుతంగా ఉండాలి' - దిల్లీ హింసపై సీపీ అంజనీ కుమార్ స్పందన
దిల్లీ అల్లర్లను అవకాశంగా తీసుకోవాలని చూసే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని నగరపౌరులకు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సూచించారు. అందరూ ఐకమత్యంతో శాంతిని పాటించాలని కోరారు.
'నగరవాసులంతా శాంతియుతంగా ఉండాలి'
దిల్లీ అల్లర్లను అవకాశంగా తీసుకోవాలని చూసే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని నగరపౌరులకు సీపీ సూచించారు. అందరూ శాంతి, ఐకమత్యాన్ని పాటించాలని కోరారు. పుకార్లు, వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
నగరంలో అల్లర్లకు తావులేకుండా గస్తీని పెంచామని, ఆపత్కర సమయాల్లో తమ పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో ఉంటాయని సీపీ పేర్కొన్నారు.
Last Updated : Feb 26, 2020, 7:58 AM IST