ఇళ్లలో చోరీలు చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు దొంగలను పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పహాడీషరీఫ్కు చెందిన మజీద్, మోసిన్ అలీ పాత నేరస్థులు. గతంలో వీరిపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మజీద్ పై 40 కేసులు, మోసిన్పై 11 కేసులున్నాయి. పీడీ చట్టం కింద కూడా జైలుకెళ్లొచ్చారు. అయినా వీరి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నెల 2వ తేదీన టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధి జాఫర్ గూడలోని ఓ ఇంట్లో చోరీ చేశారు. 31 తులాల బంగారు ఆభరణాలు, 3లక్షల నగదు దోచుకెళ్లారు. చోరీ చేసిన సొత్తును విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పశ్చిమ మండల టాస్క్ పోర్స్ పోలీసులకు చిక్కారు.
ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు అరెస్ట్ - arrested two robbers
ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను... పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 25 తులాల బంగారం, 50వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
![ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3858201-359-3858201-1563287353597.jpg)
ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు అరెస్ట్
ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు అరెస్ట్
ఇదీ చూడండి: పదోతరగతి విద్యార్థి బలవన్మరణం.. వేధింపులే కారణం