తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.3వేలు ఇస్తే జనన, మరణ ధ్రువపత్రాలు.. నకిలీ ముఠా గుట్టురట్టు

Fake Birth And Death Certificates Case In Hyderabad: వ్యవస్థలోని లోపాన్ని అనుకూలంగా మలుచుకుంటున్న కొందరు దళారులు డబ్బుల కోసం నకిలీ జనన, మరణధ్రువపత్రాలు జారీచేస్తున్నారు. దళారులకు బల్దియా సిబ్బంది.. సహకారం ఉండటంతో వారి దందా మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. పోలీసులు నిఘాపెట్టి దాడులుచేస్తే తప్ప ఇలాంటి మోసాలు మోసాలు బయటపడట్లేదు. ఇటీవలే వెలుగులోకి వచ్చిన 31 వేల నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల జారీపై బల్దియా విచారణ చేపట్టింది.

fake certificates
ఫేక్‌ సర్టిఫికేట్స్‌

By

Published : Mar 8, 2023, 1:47 PM IST

రూ.3000 ఇస్తే చాలు నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలు

Fake Birth And Death Certificates Case In Hyderabad:నకిలీ సర్టిఫికెట్ల బాగోతాలు పోలీసుల దాడుల్లో బయటపడుతూనే ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసులు మీ సేవాకేంద్రాల్లో దాడిచేసి ఆపరేటర్లను ప్రశ్నిస్తే. నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. పాతబస్తీలోని మొఘల్‌పురాలో.. నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు విక్రయిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. 2 నెలల క్రితం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 243 నకిలీ సర్టిఫికెట్లను గుర్తించి.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మీ సేవా కేంద్రాలు నిర్వహిస్తున్న నలుగురు ఓ ముఠాగా ఏర్పడ్డారు. తలాబ్‌కట్టలో మీసేవా కేంద్రం నిర్వహిస్తున్న ఇబ్రహీం వారికి నేతృత్వం వహించాడు. జనన ధ్రువీకరణ పత్రం కావాల్సిన వాళ్లపేరు, ఇతర వివరాలు తీసుకున్న ముఠాసభ్యులు వెబ్ సైట్‌లో దరఖాస్తు చేస్తున్నారు. ఆస్పత్రి నుంచి, మండల రెవెన్యూ అధికారి నుంచి కానీ ఎలాంటి ధ్రువీకరణ పత్రం లేకుండా.. వెబ్‌సైట్‌లో తప్పుడు పత్రాలు అప్‌లోడ్ చేసి 15 రోజుల్లో జనన ధ్రువీకరణ పత్రాలు అందిస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్ కోసం దాదాపు రూ.3000 వరకు తీసుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ ముఠా ఏడాది వ్యవధిలో.. 3వేల సర్టిఫికెట్లు జారీ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు.

ఏడాది క్రితం ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కేసు బయటపడింది. రూ.1300 తీసుకొని ఒక్కో నకిలీ సర్టిఫికెట్‌ ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలగా అందులో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, అధికారుల హస్తమునట్లు బయటపడింది. ఖైరతాబాద్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్ సతీష్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఖాసీం సాయంతో నకిలీ జనన ధ్రువపత్రాలు ఇచ్చినట్లు.. దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. మరణధ్రువీకరణ పత్రం కావాలంటే సంబంధిత డాక్యుమెంట్లను జీహెచ్ఎంసీ కార్యాలయంలో అందించాలి. వాటిని పరిశీలించిన తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ వాటిని నమోదు చేస్తారు.

Fake Certificates Case In Hyderabad: 15 రోజుల తర్వాత మీ సేవా కేంద్రాల్లో సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఖాసీం మాత్రం కొందరు ఏజెంట్లని ఏర్పాటు చేసుకొని ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే సర్టిఫికెట్లు జారీ చేశాడు. పక్క సమాచారం మేరకు ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ సతీష్‌ని అరెస్ట్‌ చేశారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఖాసీం, ఐదుగురు ఏజెంట్లను అరెస్ట్ చేశారు. దాదాపు 200 జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినట్లు దర్యాప్తులో తేలింది.

నాలుగేళ్ల క్రితం రాచకొండ పరిధిలోనూ నాలుగేళ్ల క్రితం భారీ ముఠా గుట్టు రట్టు అయ్యింది. మీసేవా కేంద్రాల నిర్వాహకులు, జీహెచ్ఎంసీ హెల్త్ అసిస్టెంట్లు, డేటా ఆపరేటర్లు కలిపి మొత్తం 20 మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించారు. కుత్బుల్లాపూర్, వెస్ట్ మారెడ్​పల్లి సర్కిళ్లలో పనిచేసే నలుగురు హెల్త్ అసిస్టెంట్లు, సబ్‌రిజిస్ట్రార్ హస్తం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దళారులు ఇందుకోసం ఆస్పత్రుల్లో పుట్టినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు.

మరోసారి బల్దియాలో 31 వేల నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలు వెలుగులోకి రావడంతో.. జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల అంశం పై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. నేటి నుంచి జీహెచ్‌ఎంసీ ఏవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి విచారణ చేపట్టనున్నారు. అక్రమాలపై అధికారుల నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉంది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం దళారులను ఆశ్రయించొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details