గణేష్ నిమజ్జనానికి (Ganesh Immersion) ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ (CP Anjani Kumar) తెలిపారు. త్వరగా నిమజ్జనం చేసేందుకు ఆటోమేటిక్ ఐడల్ రిలీజ్ సిస్టంను వాడుతున్నామని వెల్లడించారు. ట్యాంక్ బండ్‌పై (Tank bund) వినాయక నిమజ్జనానికి పోలీసులు చేస్తున్న ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు ట్యాంక్ బండ్‌పై చేసిన సుందరీకరణ దెబ్బతినకుండా ట్రయిల్ రన్ నిర్వహించారు.
ఆటోమేటిక్ ఐడల్ రిలీజ్ సిస్టం ద్వారా ఒక్కో విగ్రహం నిమజ్జనానికి (Ganesh Immersion) 4 నుంచి 6 నిమిషాలు తగ్గుతుందని సీపీ తెలిపారు. ప్రభుత్వం ట్యాంక్ బండ్‌పై సుందరీకరణ పనులు చేపట్టిందని... అవి దెబ్బ తినకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఎన్టీఆర్ మార్గ్, పీవీ నరసింహ రావు మార్గ్‌లో నిమజ్జనం కోసం ఎక్కువ ప్లాట్ ఫామ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెయిన్ ట్యాంక్ బండ్లో చిన్నవి, మధ్యస్థంగా ఉన్న వినాయక విగ్రహలను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై 16, ఎన్టీఆర్ మార్గ్‌లో 12, పీపుల్స్ ప్లాజాలో 8 క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.