హైదరాబాద్‌లో వరదసాయం అందలేదంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. లంగర్‌హౌజ్‌కు చెందిన ప్రశాంత్‌నగర్ రెండో ఫేజ్ వాసులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. వారం గడుస్తున్నా ఇంతవరకు ఒక్కరూపాయి సాయం అందలేదని వాపోయారు.
వరదసాయం కోసం బాధితుల ఆందోళన - హైదరాబాద్ తాజా సమాచారం
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పదివేల రూపాయల వరదసాయం కోసం బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌కు చెందిన ప్రశాంత్‌నగర్ రెండో ఫేజ్ వాసులు ధర్నా నిర్వహించారు. ఇంతవరకు ఒక్కరూపాయి సాయం అందలేదని వాపోయారు.
![వరదసాయం కోసం బాధితుల ఆందోళన hyderabad people demands to give fllod help ten thousund in longurhose](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9353570-472-9353570-1603961984659.jpg)
వరదసాయం కోసం బాధితుల ఆందోళన
అధికారులు, నాయకులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, వారికి అనుకూలమైన వారికే ఆర్థికసాయం అందిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.