తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు గ్రామ సమీపంలో 73 మంది ఉన్న బోటు ప్రమాదంలో నగరానికి చెందిన 21మంది ఉన్నట్లు సమాచారం తెలిసింది. వారిలో మేడిపల్లి పీఎస్ పరిధిలోని శ్రీనివాస కాలనీకి చెందిన సీహెచ్ రీటైర్డ్ రైల్వే ఉద్యోగి జానకి రామారావు, భార్య జ్యోతి రెండు రోజుల క్రితం విహారాయత్రకి వెళ్లారు. బోటు ప్రమాదంలో వీరు ఉన్నట్లు తెలిసింది. వీరితో పాటు జానకిరామరావు బావమరిది, భార్య, కుమారుడు మొత్తం ఐదుగురు బోటులో మిస్ అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా జానకి రామారావు సేఫ్గా ఉన్నట్లు సమాచారం తెలిసింది. మిగితా వారి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
బోటు ప్రమాదంలో నగరానికి చెందిన 21మంది..! - tourist boat sinks east godavari district
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో పర్యాటక బోటు మునిగిపోయింది. ఈ బోటులో మొత్తం 72 మంది ఉండగా, హైదరాబాద్ నగరానికి చెందిన 21మంది ఉన్నట్లు సమాచారం.
![బోటు ప్రమాదంలో నగరానికి చెందిన 21మంది..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4450137-328-4450137-1568556869344.jpg)
బోటు ప్రమాదంలో నగరానికి చెందిన 21మంది..!