హైదరాబాద్ పాతబస్తీలో వినాయక ప్రతిమను క్యారం బోర్డు, చెస్ కాయిన్లతో తయారు చేసి కొత్త ఒరవడి సృష్టించారు. గొల్లకిడికి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ వినాయకుడిని తయారుచేయడానికి వీరికి 15 రోజుల సమయం పట్టిందని నిర్వాహకులు తెలిపారు. 25 వేల కాయిన్లు అవసరమయ్యాయని పేర్కొన్నారు. ఈ వినాయకుడిని చూడటానికి భక్తులు అధికసంఖ్యలో తరలి వస్తున్నారు.
స్పోర్ట్స్ గణేశ్... పాతబస్తీ గణనాథుడు ఎంతో ప్రత్యేకం - బిట్, చెస్, కాయిన్లతో విభిన్న గణేశ్
హైదరాబాద్లో ఏ గల్లీలో చూసినా గణేశ్ మండపమే దర్శనమిస్తోంది. పాతబస్తీలో బిట్, చెస్, కాయిన్లతో విభిన్నంగా గణేశ్ మాత్రం అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నాడు.
![స్పోర్ట్స్ గణేశ్... పాతబస్తీ గణనాథుడు ఎంతో ప్రత్యేకం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4403601-946-4403601-1568184072482.jpg)
చెస్, బిట్ కాయిన్లతో విభిన్న గణేశ్