హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సులు ఆందోళన చేపట్టారు. వేతన బకాయిలు చెల్లించాలని... పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ... నిరసన తెలిపారు. ఇప్పటివరకు సుమారు 2 కోట్ల 80 లక్షల బకాయిలు రావాలని తెలిపారు.
నిమ్స్ ఆస్పత్రిలో 400 మంది స్టాఫ్ నర్సుల ఆందోళన - నర్సుల ఆందోళన వార్తలు
వేతన బకాయిలు చెల్లించాలని, పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిమ్స్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సులు ఆందోళనకు దిగారు. సుమారు 2కోట్ల 80 లక్షల బకాయిలు రావాలని తెలిపారు.
నిమ్స్ ఆస్పత్రిలో 400 మంది స్టాఫ్ నర్సుల ఆందోళన
కొన్ని రోజులాగా శాంతియుతంగా నిరసన తెలిపినా... యాజమాన్యం నుంచి స్పందన రాలేదని వాపోయారు. దాదాపు 400 మంది స్టాఫ్ నర్సులు విధులు బహిష్కరించి ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. దీంతో ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలోని రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి:ఆయుర్వేద జీవోకు వ్యతిరేకంగా నిమ్స్ ఆస్పత్రిలో నిరసన