తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్ ఆర్​పీఓగా జొన్నలగడ్డ స్నేహజ - Hyderabad New RPO Jonnalagadda Snehaja

Hyderabad New RPO Jonnalagadda Snehaja : హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిణి(ఆర్పీవో)గా 2016 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ (ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌) స్నేహజ జొన్నలగడ్డ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆమె బీజింగ్‌లోని భారత విదేశాంగ కార్యాలయంలో కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం హైదరాబాద్​ ఆర్పీవోగా విధులు నిర్వర్తించిన దాసరి బాలయ్య దిల్లీకి బదిలీ అయ్యారు

IFS Officer Jonnalagadda Snehaja Success Story
Jonnalagadda Snehaja Assumes Charge As New RPO

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2023, 10:30 AM IST

Hyderabad New RPO Jonnalagadda Snehaja :2016 బ్యాచ్‌కి చెందిన ఐఎఫ్‌ఎస్‌ (ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌) అధికారిణి స్నేహజ జొన్నలగడ్డ హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిణి(ఆర్పీవో)గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అశ్విని సత్తారు తర్వాత రెండో మహిళగా బాధ్యతలు స్వీకరించిన స్నేహజ.. ఆర్పీవో పదవిని చేపట్టడానికి ముందు బీజింగ్‌లోని భారత విదేశాంగ కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేశారు. దిల్లీలో బంగ్లాదేశ్‌, మయన్మార్‌ డివిజన్‌ కార్యదర్శిగా, విజిలెన్స్‌ డివిజన్‌లో పలు బాధ్యతలు చేపట్టారు. ఆర్పీవోగా విధులు నిర్వర్తించిన దాసరి బాలయ్య దిల్లీకి బదిలీ అయ్యారు. ఆయన కేంద్ర రెవెన్యూ విభాగంలో అదనపు కమిషనర్‌గా వెళ్లనున్నారు.

ఐఏఎస్​ అధికారుల జీతం ఎంతో తెలుసా? ఆ 7 బెనిఫిట్స్​ కూడా!

IFS Officer Jonnalagadda Snehaja Success Story: డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఉద్యోగి సుజాత, సీఏ జే వెంకటేశ్వర్లు దంపతుల కుమార్తె స్నేహజ. హైదరాబాద్‌ నగరంలోనే పుట్టి పెరిగిన స్నేహజ ఇక్కడే ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ ఉన్న కొంత మంది విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు సీఏ నేర్పించారు. 2015లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో 103వ ర్యాంకు సాధించి తెలంగాణలోనే టాప్ ర్యాంకర్‌గా నిలిచి.. ఐఎఫ్‌ఎస్‌గా ఎంపికయ్యారు.

ABOUT THE AUTHOR

...view details