హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కింగ్ కోఠిలోని జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన కొవిడ్ కేంద్రం పని తీరుపై ఆయన ఆరా తీశారు.
కొవిడ్ రోగుల వైద్యంపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరా! - Hyderabad MP Asaduddin Owaisi
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ కోరలు చాస్తోంది. ఈ తరుణంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కింగ్ కోఠిలోని జిల్లా ఆసుపత్రిని సందరించారు. ఆసుపత్రిలో రోగులకు వైద్యం సక్రమంగా అందుతుందా అని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
![కొవిడ్ రోగుల వైద్యంపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరా! Hyderabad MP Asaduddin Owaisi visited the district hospital in King Koti.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7956453-460-7956453-1594289808361.jpg)
కొవిడ్ రోగుల వైద్యంపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరా!
అనంతరం రోగులకు సక్రమంగా వైద్యం అందుతుందా లేదా... ఇంకా ఏమైనా వారికి లోటుపాట్లు ఉన్నాయా అని వైద్యులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని వైద్యులకు తెలిపారు.
Last Updated : Jul 9, 2020, 4:38 PM IST