శ్రీశైలం విద్యుత్ కేంద్రం ప్రమాద ఘటనలో మృతి చెందిన ఏఈ ఉజ్మా ఫాతిమా ధైర్యం అందరికి స్ఫూర్తిదాయకమని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. హైదరాబాద్ అజాంపురా హరిలాల్ బాగ్లో ఉన్న ఫాతిమా ఇంటికి వచ్చిన ఒవైసీ.. ఆమె కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.
ఫాతిమా కుటుంబాన్ని పరామర్శించిన అసదుద్దీన్ ఒవైసీ - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
శ్రీశైలం విద్యుత్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఏఈ ఉజ్మా ఫాతిమా కుటుంబాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరామర్శించారు. ఆమె కుటుంబానికి త్వరగా సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫాతిమా కుటుంబాన్ని పరామర్శించిన అసదుద్దీన్ ఒవైసీ
ఫాతిమా చిన్నప్పటి నుంచి ధైర్యశాలియని... చదువులో ముందుండేదని ఆయన తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడేందుకు అవకాశం వున్నా ఇతరులను కాపాడే క్రమంలో అసువులు బాసిందని కొనియాడారు. ఆమె కుటుంబానికి త్వరగా సహాయం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: సంతోషంగా పండుగకు వస్తాడనుకుంటే.. పార్థివదేహంగా వచ్చాడు..