Hyderabad MMTS Trains Cancelled :హైదరాబాద్‌లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను అధికారులు రద్దు చేశారు. నాంపల్లి - మేడ్చల్ మార్గంలో ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నాంపల్లి రైల్వేస్టేషన్‌లో రైలు ప్రమాదం వల్ల ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Charminar Express Derailed at Nampally :నాంపల్లి రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. ఈ ఉదయం 8 గంటల 40 నిమిషాలకు చెన్నె నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ మీదుగా నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. సికింద్రాబాద్‌లోనే చాలా వరకు ప్రయాణికులు దిగిపోగా, మిగిలిన వారితో చివరి స్టేషన్ అయిన నాంపల్లికి వచ్చింది. స్టేషన్‌లో ఐదో ప్లాట్‌ఫాంపైకి వచ్చిన రైలు, ఆగే సమయంలో అక్కడి డెడ్ ఎండ్ వాల్‌ను ఢీకొట్టింది.
గంటల వ్యవధిలోనే రెండు రైలు ప్రమాదాలు- పట్టాలు తప్పిన గూడ్స్
ఈ క్రమంలో ఒక్కసారిగా రైలు కుదుపునకు గురికాగా, మూడు బోగీలు ఎస్ 2, ఎస్ 3, ఎస్ 6 పట్టాలు తప్పి పాక్షికంగా దెబ్బతిన్నాయి. సికింద్రాబాద్‌లోనే ప్రయాణికులు చాలా వరకు దిగిపోగా, మిగిలిన వారు నాంపల్లిలో దిగేందుకు డోర్‌ల వద్దకు చేరుకుంటుండగానే ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఆరుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు, రైల్వే సిబ్బంది వెంటనే స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ఎఫెక్ట్ కాస్త నగరంలో పలు ఎంఎంటీఎస్ రైళ్లపై పడింది. నాంపల్లి - మేడ్చల్ మార్గంలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను అధికారులు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. దీని వల్ల రోజూ ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎప్పటివరకు రైల్ సర్వీసులను సస్పెండ్ చేశారో తెలియకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. వీలైనంత త్వరగా సర్వీసులు పునరుద్ధరించాలని కోరుతున్నారు.
మరోవైపు ఈ ఘటనపై రైల్వేశాఖ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ ఘటన గురించి ఆరా తీశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్- ఆరుగురికి గాయాలు
పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. 8 రైళ్లు రద్దు.. సహాయక చర్యలు ముమ్మరం