హైదరాబాద్ మెట్రో రైలును సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఇవాళ ఉదయం పదిన్నర గంటల సమయంలో నాగోలు నుంచి అమీర్‌పేట వెళ్తున్న మెట్రో రైలు.. ప్యారడైస్ స్టేషన్ వద్ద సాంకేతిక సమస్యతో అరగంటపాటు నిలిచిపోయింది. స్పందించిన మెట్రో సాంకేతిక సిబ్బంది మరమ్మతులు చేసినప్పటికీ రైలు కదలకపోగా మరో మెట్రో రైలును రప్పించి ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషన్‌లోని సైడ్ ట్రాక్‌కు తరలించారు. ప్రయాణికులు ఇబ్బందిపడకుండా మరో రైలును నడిపించారు. ప్యారడైస్ స్టేషన్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం జరిగినందుకే సాంకేతిక సమస్య ఉత్పన్నమైందని అధికారులు వెల్లడించారు.
మెట్రోను వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు - Hyderabad metro stopped at paradise station
ఉదయం పదిన్నర సమయంలో ప్యారడైస్ స్టేషన్ వద్ద సాంకేతిక సమస్యతో హైదరాబాద్ మెట్రో రైలు ఆగిపోయింది. వెంటనే స్పందించిన సిబ్బంది ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
![మెట్రోను వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4729275-thumbnail-3x2-vysh.jpg)
సాంకేతిక సమస్యల వల్ల ఆగిపోయిన హైదరాబాద్ మెట్రో