తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆందోళన విరమించిన మెట్రో టికెటింగ్ సిబ్బంది.. విధులకు హాజరు

Hyderabad metro staff protest ends: తమ డిమాండ్లు నెరవేర్చాలని రెండ్రోజుల పాటు ధర్నాకు దిగిన హైదరాబాద్ మెట్రో సిబ్బంది ఎట్టకేలకు తమ ఆందోళన విమరించారు. ఇవాళ నగరంలోని మెట్రో స్టేషన్​లన్నింటిలో టికెటింగ్ సిబ్బంది విధులకు హాజరయ్యారు. సిబ్బంది హాజరుతో మెట్రో కార్యకలాపాలు ఇదివరకటిలాగే సాగుతున్నాయి. మొదటి షిఫ్ట్​లో టికెటింగ్ సిబ్బంది తమ విధులు నిర్వహిస్తున్నారు.

Hyderabad metro
Hyderabad metro

By

Published : Jan 5, 2023, 10:52 AM IST

Updated : Jan 5, 2023, 12:26 PM IST

Hyderabad metro staff protest ends: తమ డిమాండ్లు నెరవేర్చాలని రెండ్రోజుల పాటు ధర్నాకు దిగిన హైదరాబాద్ మెట్రో సిబ్బంది ఎట్టకేలకు తమ ఆందోళన విమరించారు. ఇవాళ నగరంలోని మెట్రో స్టేషన్​లన్నింటిలో టికెటింగ్ సిబ్బంది విధులకు హాజరయ్యారు. సిబ్బంది హాజరుతో మెట్రో కార్యకలాపాలు ఇదివరకటిలాగే సాగుతున్నాయి. మొదటి షిఫ్ట్​లో టికెటింగ్ సిబ్బంది తమ విధులు నిర్వహిస్తున్నారు.

Hyderabad metro staff

అధికారుల షరతులకు లోబడి విధులకు హాజరైనట్లు వెల్లడించారు. ఇంక్రిమెంట్, ట్రైన్​లో వెళ్లేందుకు అనుమతిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చారని చెప్పారు. అన్ని మెట్రో స్టేషన్​లలో యథావిథిగా ఉద్యోగులు విధులకు హాజరు కావడంతో మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రెండ్రోజులుగా ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు ఇవాళ ఊపిరిపీల్చుకున్నారు.

వేతనాలు పెంచాలని, మెట్రోలో ఉచితంగా యాక్సెస్‌ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో మంగళవారం రోజున మెట్రో టికెటింగ్ సిబ్బంది ధర్నాకు దిగారు. వీరి ధర్నాతో దిగొచ్చిన కాంట్రాక్ట్‌ ఏజెన్సీ సంస్థ, కియోలిస్‌, ఎల్‌ అండ్‌ టీ మెట్రో అధికారులు టికెటింగ్‌ సిబ్బందితో చర్చలు జరిపారు. వేతనాల పెంపునకు సంబంధించి తమకు కొంత సమయం కావాలని ఏజెన్సీలు కోరాయని చర్చల్లో పాల్గొన్న టీసీఎంవో ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఇంక్రిమెంట్, మెట్రో రైళ్లో వెళ్లడానికి అనుమతి వంటి హామీలతో టికెటింగ్ సిబ్బంది విధులకు హాజరవుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 5, 2023, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details