తెలంగాణ

telangana

ETV Bharat / state

విధులకు హాజరుకాని మెట్రో సిబ్బంది.. మళ్లీ చర్చలు జరుపుతున్న యాజమాన్యం - metro staff protest continues on second day

Hyderabad Metro Staff Protest on Second Day: హైదరాబాద్​లో మెట్రో టికెటింగ్ సిబ్బంది ఆందోళన రెండోరోజు కొనసాగుతోంది. దాంతో మెట్రో యాజమాన్యం మరోసారి టికెటింగ్ సిబ్బందితో చర్చలు జరుపుతోంది. సమ్మెలో పాల్గొంటున్న అందరిని యాజమాన్యం చర్చలకు ఆహ్వానించింది.

metro staff protest
metro staff protest

By

Published : Jan 4, 2023, 9:38 AM IST

Updated : Jan 4, 2023, 11:55 AM IST

Hyderabad Metro Staff Protest on Second Day: మెట్రో టికెటింగ్ సిబ్బందితో ఇవాళ మరోమారు మెట్రో యాజమాన్యం చర్చలు జరుపుతోంది. సమ్మెలో పాల్గొంటున్న అందరిని యాజమాన్యం చర్చలకు ఆహ్వానించింది. దాంతో మళ్లీ మెట్రో టికెటింగ్ సిబ్బంది అధికారులతో సమావేశమయ్యారు. అంతకుముందు ఉప్పల్​లోని మెట్రో డిపో వద్ద సమ్మె కొనసాగించారు.

హైదరాబాద్​లో రెండోరోజు మెట్రో టికెటింగ్ సిబ్బంది విధులకు హాజరుకాలేదు. ఇవాళ కూడా నాగోల్ మెట్రో కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నారు. తమ వేతనాలు పెంచాలంటూ నిన్నటి నుంచి మెట్రో రైల్‌ టికెటింగ్ సిబ్బంది నిరసన కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అమీర్​పేట్ మెట్రో స్టేషన్​లో కార్యాకలాపాలు యథావిథిగా సాగుతున్నాయి. సాధారణంగా ప్రయాణికుల రాకపోకలు, టికెట్ల జారీ యథాతథంగా జరుగుతున్నాయి.

తమ జీతాలు పెంచాలంటూ మంగళవారం రోజున ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ కారిడార్‌లోని 27 మెట్రో స్టేషన్లలో సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఆయా స్టేషన్ల వద్ద మెట్రో టికెటింగ్‌ ఉద్యోగులు ధర్నాలకు దిగారు. గత కొంత కాలంగా తమకు సరైన జీతభత్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్నప్పుడు రిలీవర్‌ సరైన సమయానికి రాకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీసం భోజనం చేయడానికీ సమయం ఇవ్వడం లేదని ఆక్షేపించారు. వేతనాలు పెంచే వరకు విధులకు హాజరుకాబోమని తేల్చిచెప్పారు.

నిన్న సిబ్బంది మెరుపు ఆందోళనతో మెట్రో కియోలిస్ సబ్ ఏజెన్సీ నిర్వాహకులు వారితో.. అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌లో చర్చలు జరిపారు. దాంతో ధర్నా విరమిస్తున్నట్లు ప్రకటించిన ఉద్యోగులు.. నిర్వాహకులు వేతనాల పెంపుపై ఉన్నతాధికారులతో చర్చించి చెబుతామనన్నారని తెలిపారు. స్పష్టమైన హామీ వచ్చేవరకు.. విధులకు మాత్రం హాజరుకామని టికెటింగ్ సిబ్బంది స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 4, 2023, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details