హైదరాబాద్ మెట్రో రైలులో రికార్డు స్థాయిలో నగర వాసులు ప్రయాణిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే మూడు కారిడార్లలోనే కలిపి మొత్తం 4 లక్షల 47 వేల మంది ప్రయాణించినట్లుగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇటీవల కొత్తగా ప్రారంభమైన జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్లో నిన్న ఒక్కరోజులో 34 వేల మంది ప్రయాణించారు. త్వరలోనే ఎంజీబీఎస్- జేబీఎస్ కారిడార్లో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
మెట్రోలో రికార్డు స్థాయిలో ప్రయాణం - hyderabad metro trains
హైదరాబాద్ మెట్రోకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం మూడు కారిడార్లలో కలిపి రికార్డు స్థాయిలో 4లక్షల 47 వేల మంది ప్రయాణించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి వెల్లడించారు.
మెట్రోలో రికార్డు స్థాయిలో ప్రయాణం
క్యూఆర్ కోడ్ టికెట్ విధానంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోందని వెల్లడించారు. అత్యధికంగా అమీర్పేట్ మెట్రో స్టేషన్ నుంచి 26 వేల మంది ప్రయాణికులు, ఎల్బీనగర్ స్టేషన్ నుంచి 24 వేలు, రాయదుర్గం స్టేషన్ నుంచి 22 వేల మంది ప్రయాణించినట్లు ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం : సీఎం కేసీఆర్