Hyderabad Metro Rail Timings on 31st December :నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని డిసెంబరు 31 అర్ధరాత్రి వరకు మెట్రో రైలు ప్రయాణాన్ని పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. సాధారణ రోజుల్లో రాత్రి 11 గంటల వరకే చివరి రైలు ఉండగా, డిసెంబరు 31వ తేదీ మాత్రం అర్ధరాత్రి 12.15 గంటలకు చివరి రైలు మొదలవుతుందని చెప్పారు. జనవరి 1వ తేదీన 1 గంటకు ఆ రైలు తన గమ్యస్థానాన్ని చేరుకుంటుందని మెట్రో ఎండీ వివరించారు.
New year celebrations 2024 : న్యూయర్(New Year Day 2024) సమయంలో మెట్రో ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. మద్యం సేవించి వచ్చినా, తోటి ప్రయాణికుల పట్ల దుర్భాషలాడిన మెట్రో రైలు భద్రతా సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా బాధ్యతాయుతంగా మెట్రో రైళ్లలో ప్రయాణించాలని ఆయన ప్రయాణికులను కోరారు.
హైదరాబాద్లో న్యూయర్ వేడుకలకు రాచకొండ సీపీ హుకుం - యువత జరభద్రం ఇక
New Year Traffic Restrictions2024 : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు(ORR)తో సహా అన్ని ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నట్లు చెప్పారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు తప్ప మిగిలిన వాహనాల రాకపోకలు నిలిపి వేస్తున్నట్లు మేడ్చల్ డివిజన్ ట్రాఫిక్ డీసీపీ వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.