మెట్రో రైళ్లు మరికొంత కాలం డిపోలకే పరిమితం కానున్నాయి. వీటి పునఃప్రారంభం ఈ నెలలో లేనట్లేనని అధికారులు అంటున్నారు. జూన్‌లో మొదలైన లాక్‌డౌన్ 5.0లో మరిన్ని సడలింపులను కేంద్రం సూచించింది. ఇందులో పరిస్థితులను బట్టి మెట్రో రైళ్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికీ మెట్రోపై ఆంక్షల సడలింపునకు కేంద్రం సుముఖంగా లేదని తెలుస్తోంది.
జనతా కర్ఫ్యూ నుంచి
జనతా కర్ఫ్యూ సందర్భంగా మెట్రో రైళ్లు మార్చి 22న నిల్చిపోయాయి. ఆ మరుసటి రోజు నుంచే రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో సేవలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అనంతరం ఒక్కోటి ప్రారంభమవుతున్నా.. నగరంలో ప్రజా రవాణాకు అనుమతి ఇవ్వలేదు. జూన్ మూడో వారంలో మెట్రో అందుబాటులోకి రావొచ్చనే అంచనాలు ఉండేవి. వైరస్ విజృంభిస్తున్నందున మరికొంత కాలం అనుమతి ఇవ్వకపోవడమే మేలనే భావనలో కేంద్రం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.