తెలంగాణ

telangana

ETV Bharat / state

Hyderabad Metro MD NVS Reddy: దిల్లీ ఎయిర్​మెట్రోను సందర్శించిన ఎన్వీఎస్​ రెడ్డి బృందం

Hyderabad Metro MD NVS Reddy's team visited Delhi Metro: దిల్లీ విమానాశ్రయం మెట్రో సౌకర్యాలను.. హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి ఆయన బృందం పరిశీలించారు. 23 కి.మీ మెట్రోలైన్‌లో.. 16 కి.మీ భూగర్భ, 7 కి.మీ ఎలివేటెడ్‌తో దిల్లీ విమానాశ్రయాన్ని, న్యూదిల్లీ రైల్వే మెట్రో స్టేషన్‌లను కలుపుతూ ఎనిమిది స్టేషన్‌లు ఉన్నాయి. సీనియర్ డీఎంఆర్​సీ అధికారులు.. ఎండి, ఆయన బృందాన్ని T-3 విమానాశ్రయం టెర్మినల్, ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో ఉన్న భూగర్భ మెట్రో స్టేషన్‌కు తీసుకెళ్లారు.

metro
metro

By

Published : Apr 30, 2023, 7:12 PM IST

Hyderabad Metro MD NVS Reddy's team visited Delhi Metro:శంషాబాద్​ ఎయిర్​పోర్టును అనుసంధానం చేస్తూ నిర్మించతలపెట్టిన హైదరాబాద్ ఎయిర్​పోర్టు​ మెట్రో కారిడార్​ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ ఎయిర్​పోర్ట్​​ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆయన బృందం దిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో సౌకర్యాలు కార్యకలాపాలను అధ్యయనం చేశారు. దిల్లీ విమానాశ్రయం మెట్రో మొత్తం 23 కి.మీ లైన్​లో.. 16 కి.మీ భూగర్భ, 7 కి.మీ ఎలివేటెడ్​ కారిడార్​తో దిల్లీ విమానాశ్రయాన్ని, రైల్వే మెట్రో స్టేషన్‌లతో కలుపుతూ ఎనిమిది స్టేషన్‌లు ఉన్నాయి.

ఈ కారిడార్​లో ఎయిర్ పోర్ట్ మెట్రో రైలు 19 నిమిషాల్లో గరిష్టంగా గంటకు 95 కిలో మీటర్ల వేగంతో సగటున 65 కిలో మీటర్ల వేగంతో ఈ ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. సీనియర్ డీఎంఆర్‌సీ అధికారులు.. హైదరాబాద్ ఎయిర్​పోర్ట్​​ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆయన బృందాన్ని T-3 ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌లో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో ఉన్న భూగర్భ మెట్రో స్టేషన్‌కు తీసుకెళ్లారు.

అక్కడ ఉన్న లగేజీ చెకింగ్​ విధానాన్ని బృందం పరిశీలించింది. రెండు సిటీ మెట్రో స్టేషన్లలో చెక్-ఇన్ చేయబడి, దిల్లీ విమానాశ్రయానికి బదిలీ చేయబడిన లగేజీ విమానాశ్రయం వైపు బదిలీకి సంబంధించిన సౌకర్యాలను, ఇతర కార్యకలాపాలను ఎండీ తనిఖీ చేశారు. ఆ తర్వాత మెట్రో రైలులో న్యూదిల్లీ స్టేషన్‌కు ప్రయాణించారు.

న్యూదిల్లీ స్టేషన్‌లో నగరం వైపు చెక్ ఇన్ సౌకర్యాన్ని పరిశీలించారు. దిల్లీ చుట్టుపక్కల ఉన్న వివిధ పట్టణాలు, నగరాలకు హై స్పీడ్ రైలు కనెక్టివిటీని అభివృద్ధి చేస్తున్న రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్.. కొనసాగుతున్న పనులతో పాటు ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్వహణ డిపో ఇతర సౌకర్యాలను ఈ బృందం సందర్శించింది. డిపోలు, స్టేషన్ల లేఅవుట్లు, మెట్రో కోచ్‌ల నిర్వహణ సౌకర్యాలు, డిపోలు, స్టేషన్లలో ప్రాపర్టీ డెవలప్‌మెంట్ తదితర అంశాలపై అధ్యయనం చేశారు.

తర్వాత ఎన్వీఎస్ రెడ్డి, ఆయన బృందం డీఎంఆర్‌సీ ఎండీ వికాస్ కుమార్,నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఎండీ వి.కె. సింగ్ సీనియర్ ఇంజనీర్ల బృందాలతో పరస్పర అనుభవాలను పంచుకోని చర్చించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details