ఈ నెల 7 నుంచి హైదరాబాద్ మెట్రో రైలు సేవలు పునరుద్ధరించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ ఆధారంగా సర్వీసులపై నిర్ణయం తీసుకోనున్నారు. మెట్రో స్టేషన్లు, రైళ్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని.. వాటిని సీసీటీవీల ద్వారా పర్యవేక్షించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
''పరిమిత సమయాల్లోనే హైదరాబాద్ మెట్రో సేవలు''
19:16 September 03
'లక్షణాలు లేని వాళ్లకు మాత్రమే మెట్రో ప్రయాణానికి అనుమతి'
ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. లేని పక్షంలో జరిమానా విధిస్తామన్నారు. లక్షణాలు లేని వాళ్లకు మాత్రమే మెట్రో ప్రయాణానికి అనుమతిస్తామని.. మెట్రో ఉద్యోగులందరికీ పీపీఈ కిట్లు అందించనున్నట్లు పేర్కొన్నారు. స్మార్ట్ కార్డులు, నగదు రహిత విధానంలోనే టికెట్లు జారీ చేస్తామన్న ఎన్వీఎస్ రెడ్డి దశలవారీగా రైళ్లను నడపనున్నట్లు తెలిపారు.
తొలి ఫేజ్‌లో భాగంగా ఈనెల 7న మియాపూర్- ఎల్బీనగర్ మార్గంలో మెట్రో సేవలు ప్రారంభిస్తామని.. రెండో ఫేజ్‌లో 8న నాగోల్- రాయదుర్గం మార్గంలో.. మూడో ఫేజ్‌లో బాగంగా సెప్టెంబరు 9న అన్ని మార్గాల్లో మెట్రో సేవలు పునరుద్ధరిస్తామని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. అయితే ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ప్రయాణికులను అనుమతించనున్నారు. కంటైన్మెంట్ జోన్లుగా ఉన్న గాంధీ ఆస్పత్రి, భరత్‌నగర్, మూసాపేట్, ముషీరాబాద్, యూసఫ్‌గూడ మెట్రో స్టేషన్లను మూసివస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి:ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన
TAGGED:
BREAKING