హైదరాబాద్ పాతబస్తీలో మెట్రోరైల్ పనులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ను మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అక్బరుద్దీన్ కలిశారు. పాతబస్తీతో మెట్రో రైల్‌ను అనుసంధానించాలన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.
త్వరలో పాతబస్తీకి మెట్రో: సీఎం కేసీఆర్ - cm kcr on oldcity metro
పాతబస్తీలో మెట్రోరైలు పనులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ను అక్బరుద్దీన్ కోరారు. పాతబస్తీకి మెట్రోరైలు అనుసంధానించాలనే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పాతబస్తీలోనూ మెట్రో రైల్ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
akbaruddin meet kcr
త్వరలోనే మెట్రో రైల్ పనులు ప్రారంభమవుతాయని అక్బరుద్దీన్‌తో సీఎం పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని సీఎం చెప్పారు.
ఇదీ చూడండి:మహంకాళి ఆలయానికి రూ.10 కోట్లు ఇవ్వండి: అక్బరుద్దీన్
Last Updated : Feb 9, 2020, 8:49 PM IST