నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల వద్ద విస్తరించాయని... హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వీటి తీవ్రత పెరిగి ఆ ప్రదేశాల్లోనే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది.
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు వర్షం
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని... హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల వద్ద విస్తరించాయని ప్రకటించింది.
ఈ అల్పపీడనం మరింత బలపడి 24వ తేదీన తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా, పశ్చిమ బంగాల్ తీరానికి 26న ఉదయం చేరుకునే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న వెల్లడించారు. దీని కారణంగా రాష్ర్టంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఇదీ చదవండి: లైవ్ అప్డేట్స్: గుజరాత్ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్ పిటిషన్ కొట్టివేయాలి: దవే