తెలంగాణ

telangana

ETV Bharat / state

నైరుతి రుతుపవనాలు వెళ్లేందుకు అనుకూల పరిస్థితులు..! - రాష్ట్ర వాతావరణం వార్తలు తెలంగాణ

రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు పొడివాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి నైరుతి రుతుపవనాలు భారతదేశం నుంచే వెళ్లేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, కేరళ రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

నైరుతి రుతుపవనాలు వెళ్లేందుకు అనుకూల పరిస్థితులు..!
నైరుతి రుతుపవనాలు వెళ్లేందుకు అనుకూల పరిస్థితులు..!

By

Published : Oct 27, 2020, 7:57 PM IST

బుధవారం నుంచి నైరుతి రుతుపవనాలు మొత్తం భారతదేశం నుంచి ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాతావవరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.

మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో 1.5 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో 3.1 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం సంచాలకుడు రాజారావు వివరించారు. రాగల మూడు రోజులపాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

ఇదీ చదవండి:వాతావరణ సూచన: రాష్ట్రంలో రాగల మూడురోజులు పొడి వాతావరణం

ABOUT THE AUTHOR

...view details