ఎన్నడూ లేనంతగా అధిక వర్షాల వల్లే నగరంలో నష్టం ఎక్కువగా వాటిల్లిందని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వరదలతో దెబ్బతిన్న రోడ్లకు జరుగుతోన్న మరమ్మతులు, కొత్త బీటీ రోడ్ల నిర్మాణాలను ఆయన మంగళవారం అర్ధరాత్రి పరిశీలించారు.
అర్ధరాత్రి రోడ్ల నిర్మాణాలను పరిశీలించిన మేయర్ - hyderabad news
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరుగుతోన్న రోడ్ల మరమ్మతులు, కొత్త బీటీ రోడ్ల నిర్మాణాలను హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అర్ధరాత్రి పరిశీలించారు. రోడ్ల నాణ్యతలో రాజీలేకుండా పూర్తి చేస్తామని మేయర్ తెలిపారు.
అర్ధరాత్రి రోడ్ల నిర్మాణాలను పర్యవేక్షించిన మేయర్
వర్షాలు, వరదలతో దెబ్బతిన్న సీసీరోడ్లు, గల్లీ రోడ్లన్నింటినీ ఈ నెలాఖరు వరకు మరమ్మతు చేస్తామని మేయర్ అన్నారు. రోడ్లకు పడిన గుంతలను కూడా వారం, పదిరోజుల్లో పూడుస్తామని.. రోడ్ల నాణ్యతలో రాజీపడకుండా వీలైనంత త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని మేయర్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: 'ఆర్టీసీ నష్టాలు వీడి... లాభాల్లోకి పరిగెత్తేనా?'