Krishnamurthy Antiques Collection : ఒక్కొక్కరికి ఒక్కో ఆసక్తి ఉంటుంది. హైదరాబాద్‌కు చెందిన కృష్ణమూర్తికి కూడా ఓ భిన్నమైన అభిరుచి ఉంది. అదేంటంటే.. ఇత్తడి తదితర లోహాలతో తయారు చేసిన పురాతన సామగ్రిని సేకరించడం. అలా సేకరించిన 900కి పైగా పాత్రలు, వస్తువులతో ఏకంగా తన ఇంటినే మ్యూజియంగా మార్చేశాడీ రిటైర్డ్ ఉద్యోగి. అసలా ఆలోచన ఎలా వచ్చిందంటే - చెన్నైలో పనిచేస్తున్నప్పుడు ఒకరోజు ఆయన తాతయ్య చనిపోయాడు. అమ్మమ్మ ఒంటరి కావడంతో ఇంటికి తాళం వేసి తన దగ్గరకు తీసుకెళ్దామనుకున్నాడు. కానీ, ఆమె తనతో పాటు ఇత్తడి, రాగి వంట సామగ్రినీ తెచ్చుకుంటానని పట్టుబట్టడంతో సరేనన్నాడు. అప్పుడు ఆమె మాటల ద్వారా లోహ పాత్రల ప్రాధాన్యం తెలిసొచ్చిందాయనకు. ఆరోగ్యానికి అవి చేసే మేలును భవిష్యత్తు తరాలకూ తెలియజేయాలనుకున్నాడు. అప్పటి నుంచీ వాటి సేకరణ ప్రారంభించి.. నేటికీ కొనసాగిస్తున్నాడు.
Krishnamurthy Antiques Collection : ఆయన ఇల్లే ఓ మ్యూజియం.. వందల సంఖ్యలో పురాతన వస్తువులు!
Krishnamurthy Antiques Collection : ఆ ఇంటిని చూసి మ్యూజియం అనుకుంటే పొరబడినట్లే. తనకున్న అభిరుచితో ఇంటినే పురాతన వస్తు ప్రదర్శనశాలగా మార్చేశారు హైదరాబాద్‌కు చెందిన కృష్ణమూర్తి. నానమ్మల కాలం నాటి పస్తువులను పదిలంగా భద్రపరుస్తున్నారు. ఆయకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే..?
ఆయన ఇల్లే మ్యూజియం