తెలంగాణ

telangana

ETV Bharat / state

Hyderabad Man Kills Daughter : భవిష్యత్​లో కష్టాలొస్తాయని.. కూతుర్ని చంపేశాడు - Hyderabad Man Kills Daughter For Revenge

Hyderabad Man Kills Daughter : భాగ్యనగరంలో సంచలం సృష్టంచిన కూతురుని తండ్రి చంపిన కేసులో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన కూమార్తె జాతకరీత్యా భవిష్యత్​లో కష్టాలు వస్తాయని అనుభవిస్తుందన్న గుడ్డి నమ్మకంతో తండ్రి నిలువెల్లా విషాన్ని నింపికోన్నాడు. తన భార్య సరిగ్గా చూసుకోకపోతే తన కూమార్తె పెద్దయ్యాక ఒంటరిగా మిగిలిపోతుందేమోనని భావించిన కిరాతకుడు తన కూతురిని అత్యంత దారుణంగా చంపాడు.

Father Killed Daughter at Hyderabad
Father Kills Daughter Update

By

Published : Aug 21, 2023, 10:29 AM IST

Father Kills Daughter Update కుమార్తెను చంపిన తండ్రి కేసులో విస్తుపోయే వాస్తవాలు జాతక రీత్యా భవిష్యత్‌లో కష్టాలు వస్తాయని హత్య

Hyderabad Man Kills Daughter :మానవత్వం మంటగలిసిపోతుంది. కన్నపేగును సైతం కాలరాస్తోంది. భార్యకు ఆనందాన్ని దూరం చేద్దామని కుట్ర పన్నిన భర్త..అభం శుభం తెలియనికన్న కుమార్తెనే కడ తేర్చాడు. శవాన్ని మాయం చేసే క్రమంలో అనూహ్యంగా ప్రమాదానికి కారణమై.. పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన కుందేటి చంద్రశేఖర్‌, హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌ ప్రాంతానికి చెందిన హిమబిందుకు 2011లో వివాహం జరిగింది.

Hyderabad Man Kills Daughter For Revenge : గతంలో భార్యాభర్తలు ఇద్దరూ బెంగళూరులో ఒకే ఐటీ కంపెనీలో పనిచేశారు. భార్య ఉన్నతస్థాయి బాధ్యతల్లో పనిచేస్తున్నారు. భర్త కింది స్థాయి ఉద్యోగిగా ఉన్నారు. అమెరికా, హైదరాబాద్‌లో ఒకే కంపెనీలో పనిచేసినప్పుడు భార్య టీం లీడర్‌ బాధ్యతల్లో చేపట్టారు. భర్త చంద్రశేఖర్‌ సాధారణ ఉద్యోగి(Software Job). పనితీరు బాగోలేదన్న కారణంతో చంద్రశేఖర్‌ను ఐటీ కంపెనీ సంస్థ(IT Company Organization) ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పుడే చంద్రశేఖర్‌ భార్యపై కక్ష పెట్టుకున్నాడు. టీం లీడర్‌ స్థానంలో తన భార్య చెప్పడం వల్లే కంపెనీ తన ఉద్యోగం నుంచి తొలగించారని అనుమానించాడు. ఇదే విషయమై భార్యతో ఇంట్లో తరచూగ గొడవపడేవారని తెలిసింది. ఈ వేధింపులు తట్టుకోలేని భార్య తన కూతురు మోక్షజను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

Hyderabad Rowdy Sheeter Muder Case Update : అందమైన అబ్బాయిని ఎర వేసి.. రౌడీ షీటర్​ హత్య..!

Father Kills Daughter in Hyderabad Case : వారంలో రెండుసార్లు కూతురి వద్దకి వెళ్లి చూసేవాడు. చంద్రశేఖర్‌ ఈ క్రమంలోనే మోక్షజ జాతకం గురించి తెలుసుకున్నాడు. భవిష్యత్​తో ఆమె కష్టాలు అనుభవిస్తుందని జాతకం ద్వారా భావించాడు. చందానగర్‌లో ఒంటరిగా ఉంటున్న అతను ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో పాటు.. భార్య తనను పట్టించుకోవడం లేదని.. కూతురి కోసం ఇంటికెళ్లినప్పుడు ఆమె చులకనగా చూస్తోందని రగిలిపోయాడు. కూతురిని ఆమె దగ్గరే ఉంచుకుంటోందని కక్ష పెంచుకున్నాడు. తనలాగే భార్య కూతురిని కూడా ఇబ్బందులు పెడుతుందేమోనని మానసిక భావనలోకి వెళ్లిపోయాడు. కూతురు కష్టపడొద్దని.. భార్య ఒంటరిగా మారి నరకం చూడాలన్న ఆలోచనతో మోక్షజను అంతం చేయాలని(Father Killed His Daughter at Chandanagar) పోలీసుల దర్యాప్తు తెలింది.

6 Years Boy Death in Rangareddy : బావిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి

Father Murders Daughter Shocking Facts :చిన్నారి మోక్షజను శుక్రవారం సాయంత్రం తనతో పాటు కారులో తీసుకెళ్లి గొంతుకోసి చంపాడు. స్కూల్‌ ముగిసి చాలా సమయమైనా కూతురు ఇంటికి రాకపోవడంతో భార్య కుటుంబ సభ్యులు చంద్రశేఖర్‌కు ఫోన్‌ చేశారు. పాపను ఇంకా ఇంటికెందుకు తీసుకురాలేదని ప్రశ్నించగా.. నిద్రపోతోందని నమ్మించాడు. గూగుల్‌ లొకేషన్‌ పంపిస్తే తామే వచ్చి తీసుకెళ్తామని చెబితే.. తానే వస్తానని చెప్పి ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు.

మృతదేహాన్ని నగర శివార్లలో దూరంగా విసిరేసి ఆనవాళ్లు లేకుండా చేద్దామని.. తర్వాత తన సొంతూరు విజయవాడ పారిపోవాలన్న పథకాన్ని రచించాడు. ఓఆర్‌ఆర్‌పై తారామతిపేట-కోహెడ మధ్య చక్కర్లు కొట్టినా..మృతదేహాన్ని విసిరేసే అవకాశం దొరకలేదు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో కారు టైరు పేలి డివైడర్‌ను ఢీకొట్టినప్పుడు ఓ వ్యక్తి ఆప్రమాదాన్ని గమనించాడు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న స్ధానికుడు.. కారు లోపలి చంద్రశేఖర్‌ దుస్తులకు రక్తపు మరకలు, కారులో చిన్నారి మృతదేహం కనిపించడంతో అనుమానం వచ్చి డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చందని పోలీసులు వెల్లడించారు.

Father killed his daughter at Chandanagar : భార్యపై కోపం.. సొంత కుమార్తెను బ్లేడ్​తో కోసి హత్య చేసిన తండ్రి

ABOUT THE AUTHOR

...view details