మళ్లీ లాక్‌డౌన్ తప్పదంటూ వస్తున్న వార్తలు మద్యం అమ్మకాలను అమాంతం పెంచేశాయి. ముందు జాగ్రత్తగా మద్యపాన ప్రియులు భారీగా కొనుగోళ్లకు వెంపర్లాడారు. ఫలితంగా ఒక్క సోమవారమే రెట్టింపు స్థాయిలో అమ్మకాలు సాగాయి. అకస్మాత్తుగా లాక్‌డౌన్ విధించడంతో మార్చి 22 నుంచి మిగతా వ్యాపారాలతో పాటు మద్యం దుకాణాలూ మూతపడిన సంగతి తెలిసిందే. దాదాపు నెలన్నర మద్యం దొరక్క మందుబాబులు అల్లాడిపోయారు.
మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్ - హైదరాబాద్ మద్యం అమ్మకాల వార్తలు
మందుబాబులకు లాక్‌డౌన్ భయం పట్టుకుంది. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు పెరిగాయి. మార్చి 22న అకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించడంలో మందు దొరక్క మందుబాబులు అల్లాడిపోయారు. ఆ పరిస్థితి ఇప్పుడు రావద్దనుకున్నారు. ఒక్కరోజులోనే డబుల్ కొనేశారు.
liquor sales
లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే 6 నుంచి రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను అనుమతించింది. ఒక్కసారిగా అవసరార్థులంతా మద్యం దుకాణాల ముందు బారులుతీరారు. ఒకటి రెండు రోజులు భారీగానే అమ్మకాలు సాగినా జనం వద్ద పెద్దగా డబ్బు లేకపోవడం, వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోవడం, ఇంకా చాలా పరిశ్రమలు పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడంతో మద్యం అమ్మకాలు క్రమంగా నెమ్మదించాయి.
ఇదీ చదవండి:కేబినెట్ భేటీపై నేడు నిర్ణయం.. లాక్‌డౌన్‌పై చర్చ!
Last Updated : Jul 1, 2020, 7:55 AM IST