తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్చువల్​గా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ - తెలంగాణ వార్తలు

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్​ని వర్చువల్​గా నిర్వహించనున్నారు. ఈనెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు జరపనున్నట్లు ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ప్రకటించారు.

hyderabad-literary-festival-from-january-22-to-24-through-online
వర్చువల్​గా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్

By

Published : Jan 17, 2021, 9:24 AM IST

హైదరాబాద్ ఈవెంట్స్​లో ఎంతో ప్రత్యేకమైన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఈ సారి వర్చువల్​గా జరగనుంది. ఏటా జనవరిలో నిర్వహించే లిటరరీ ఫెస్టివల్​ను వర్చువల్​గా నిర్వహించనున్నట్లు పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ట్విట్టర్​ వేదికగా ప్రకటించారు. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఇలా చేయక తప్పటం లేదని డైరెక్టర్లు అభిప్రాయపడ్డారు.

ప్రముఖ కవి గుల్జార్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ ఫెస్టివల్ ఈనెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు జయేష్ రంజన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కవి సమ్మేళనం, స్థానిక ఆర్టిస్ట్​లను భాగస్వాములను చేసేలా యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్​తో కలిసి ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ తెలిపారు.

ఇదీ చదవండి:కొత్త కొత్తగా ఇడ్లీ వడ్డించండి!

ABOUT THE AUTHOR

...view details