తెలంగాణ

telangana

ETV Bharat / state

రసాయనిక పరిశ్రమలో అగ్ని ప్రమాదం - హైదరాబాద్ శివారు జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

హైదరాబాద్​ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కార్తికేయ రసాయనిక పరిశ్రమలో విద్యుత్​ షార్ట్​ సర్క్యూట్​ వల్ల ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు.

హైదరాబాద్​ కార్తికేయ రసాయనిక పరిశ్రమలో అగ్ని ప్రమాదం

By

Published : Sep 21, 2019, 10:17 AM IST

హైదరాబాద్​ కార్తికేయ రసాయనిక పరిశ్రమలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ శివారు జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ తెల్లవారుజామున కార్తికేయ రసాయనిక పరిశ్రమలో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిరిపడి మంటలు వ్యాపించడంతో కార్మికులు భయంతో పరుగులుతీశారు. సంస్థ ప్రతినిధులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన నాలుగు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. గంటపాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో సిబ్బంది, స్థానికులు ఊరిపి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details