హైదరాబాద్ జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు మేరకు.. ఆయనను పోలీసులు వర్చువల్‌గా విచారించారు. ఆయనపై సంపత్ రెడ్డి అనే వ్యక్తి గతంలో ఫిర్యాదు చేశారు. మల్లన్న.. తన ఫోన్ నంబర్‌ను మీడియాలో స్క్రీన్‌పై ప్రదర్శించారని సంపత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
TEENMAR MALLANNA: తీన్మార్ మల్లన్నపై మరో కేసు.. వర్చువల్‌గా విచారణ - teenmar mallanna latest news
తీన్మార్ మల్లన్నను జగద్గిరి గుట్ట పోలీసులు వర్చువల్‌గా విచారించారు. ఓ వ్యక్తి ఫోన్ నంబరును మల్లన్న.. మీడియాలో స్క్రీన్‌పై పెట్టినందుకు గాను మల్లన్నపై కేసు నమోదైంది. ఈ మేరకు ఆయనను విచారించారు.
తీన్మార్ మల్లన్న
మల్లన్నపై గతంలో పలు స్టేషన్లలో కేసులు నమోదు కాగా.. ఆయన ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఈ నెల 9వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పీటీ వారెంట్‌పై మల్లన్నను వర్చువల్‌గా విచారించినట్లు సీఐ సైదులు తెలిపారు.
ఇదీ చదవండి:KRMB MEET: కృష్ణానది యాజమాన్య బోర్డు భేటీ.. వాటిపైనే కీలక చర్చ!