తెలంగాణ

telangana

ETV Bharat / state

మరో అంతర్జాతీయ వేడుకకు వేదికగా భాగ్యనగరం

భాగ్యనగరం మరో అంతర్జాతీయ వేడుకకు వేదిక కానుంది.  డిజిటల్, మీడియా, ఎంటర్​టైన్మెంట్ రంగానికి సంబంధించి ఈ నెల 20 నుంచి 23 వరకు ఇండియా జాయ్ కార్యక్రమం హైటెక్స్ వేదికగా సాగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన 18వ ఏఎస్ఐఎఫ్ఏ ఈవెంట్​కు విశేష స్పందన లభించింది.

మరో అంతర్జాతీయ వేడుకకు వేదికగా భాగ్యనగరం

By

Published : Nov 15, 2019, 3:04 PM IST

మరో అంతర్జాతీయ వేడుకకు వేదికగా భాగ్యనగరం

ఇండియా జాయ్​ డిజిటల్​ మీడియా రెండో ఎడిషన్​ భాగ్యనగరాన్ని పలకరించనుంది. ఈనెల 20 నుంచి 23 వరకు హైటెక్స్​ వేదికగా ఇండియ్​ జాయ్​ ఈవెంట్​ జరగనుంది. ఈ ఎడిషన్​కు దాదాపు 30 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.

విశేష స్పందన

ఇండియా జాయ్​ ఈవెంట్​కు సంబంధించి హైదరాబాద్​ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ఏఎస్ఐఎఫ్ఏ ఈవెంట్​కు విశేష స్పందన లభించింది. సుమారు 2500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటల్​ ఎంటర్​టైన్మెంట్​ రంగానికి సంబంధించిన ప్రముఖులు.. విద్యార్థులకు డిజిటల్​ మీడియాలో అవకాశాలు, నైపుణ్యాలకు సంబంధించిన పలు అంశాలు వివరించారు.

200 వర్క్​షాప్స్
ఇండియా జాయ్​ ఈవెంట్​లో...​ ఎంటర్​టైన్మెంట్, వీఎఫ్​ఎక్స్​, ఈ-స్పోర్ట్స్, ఓటీటీప్లస్ , ఇన్వెస్టర్ - పబ్లిషర్ కనెక్ట్ , ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ సహా దాదాపు 200 వరకు వర్కషాప్స్ కాన్ఫరెన్స్ లు జరగనున్నాయి.

నాలుగు రోజులు

తెలంగాణ ప్రభుత్వం, ఇండియా జాయ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈ నెల 20 నుంచి 23 వరకు నాలుగు రోజుల పాటు సాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు ఆన్​లైన్​లో రిజిస్టర్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. డిజిటల్ ఎంటర్​టైన్మెంట్ రంగంలో రాణించాలనుకునే వారికి ఇది చక్కని అవకాశమని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details