దేశంలో 10 లక్షలకు పైగా జనాభా కలిగి... గాలి కాలుష్యం అధికంగా ఉన్న నగరాల జాబితాను కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించింది. గాలిలో సూక్ష్మ ధూళి కణాల సంఖ్యను కొలిచే పీఎం-10... తొంభై కంటే అధికంగా ఉన్న వాటి జాబితాలో తెలంగాణ నుంచి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ ఉన్నాయి. రాష్ట్రం నుంచి నల్గొండ, పటాన్చెరు కూడా జాబితాలో ఉన్నాయి. బెంగుళూరు, కలకత్తా, ముంబయి ఇలా మొత్తం 15 నగరాలు జాబితాలో ఉన్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జావడేకర్ పేర్కొన్నారు. 2011-15 వరకు దేశంలో 105 నగరాలు గాలి నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను అందుకోలేకపోయాయని అన్నారు.
అధిక వాయు కాలుష్య నగర జాబితాలో హైదరాబాద్
గాలి కాలుష్యం అధికంగా ఉన్న నగరాల జాబితాలో తెలంగాణ నుంచి హైదరాబాద్, ఏపీ నుంచి విజయవాడ ఉన్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించింది. దేశం మొత్తం మీద 15 ప్రధాన నగరాలు ఈ జాబితాలో ఉన్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు.
కాలుష్య నగరాలు