హైదరాబాద్లోని నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) 8వ స్నాతకోత్సవానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ దశలో ఉండటం మనకు గర్వకారణమన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ శరవేగంగా వృద్ధి చెందుతోందని చెప్పారు.
లైఫ్ సైన్సెస్లో వేగంగా అభివృద్ధి: కేటీఆర్ - హైదరాబాద్ వార్తలు
హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ దశలో ఉండటం మనకు గర్వకారణమని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) 8వ స్నాతకోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.
లైఫ్ సైన్సెస్లో వేగంగా అభివృద్ధి: కేటీఆర్
నైపర్ న్యూ కాంపస్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాల స్థలంలో వరల్డ్ క్లాస్ భవనాన్ని నిర్మించాలని కేటీఆర్ సూచించారు. లైఫ్ సైన్సెస్ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ విజన్, కమిట్మెంట్తో ముందుకెళ్తోందని తెలిపారు. గ్లోబల్గా టాప్ లైఫ్ సైన్సెస్ కంపెనీలు జీనోం వ్యాలీ కేంద్రంగా పనిచేస్తున్నాయని చెప్పారు. అఫర్డబుల్ మెడిసిన్ కొరకు నూతనంగా పట్టా అందుకున్న గ్రాడ్యుయేట్లు కృషి చేయాలని కేటీఆర్ సూచించారు.
ఇదీ చదవండి:ఎండమావిగా మారిన 'సత్వర'న్యాయం