తెలంగాణ

telangana

ETV Bharat / state

వాయుగుండంగా అల్పపీడనం.. మరో మూడురోజుల పాటు వర్షాలు

రాష్ట్రంలో రాగల మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 430 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని తెలిపింది. ఈ ప్రభావంతో వర్షాలు పడుతాయని వివరించింది.

hyderabad imd weather report for telangana state
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. మరో మూడు రోజుల పాటు వర్షాలు

By

Published : Oct 11, 2020, 12:18 PM IST

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదివారం ఉదయం 05.30 గంటలకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండముగా మారి విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 430 కిమీ, నర్సాపూర్​కు తూర్పు ఆగ్నేయ దిశగా 520కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని తెలిపింది. రాగల 24 గంటలలో ఇది తీవ్ర వాయుగుండముగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.

అప్పుడు తీరం దాటుతుంది..

ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం నర్సాపూర్, విశాఖపట్నంల మధ్య అక్టోబరు 12వ తేదీ రాత్రి తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇదీ చూడండి:మరో మూడు రోజుల పాటు వర్షాలు

ABOUT THE AUTHOR

...view details