Hyderabad Girl Siddhiksha Planetary Fragments :ఈ అమ్మాయి వయసు 11 ఏళ్లు. కానీ, తన పరిశోధనంతా అంతరిక్షంపైనే. చిన్న వయసులోనే గ్రహశకలాల ఉనికి పసిగడుతున్న ఆ చిన్నారి.. పిట్ట కొంచెం కూత ఘనం అనేలా సాధన చేస్తోంది. సోదరి స్ఫూర్తితో ఖగోళశాస్త్ర పరిశోధనలు చేస్తూ.. ఎన్నో విజయాలు అందుకుం టోంది. గతంలో సోదరితో కలిసి గ్రహశకలం కనుగొని నాసా ధృవపత్రం అందుకోగా..తాజాగా మరో గ్రహశకల ఉనికిని పసిగట్టి ఔరా అనిపిస్తోంది.
Interview with IFS first ranker: సామాజిక మాధ్యమాలకు దూరం.. ఫలితంగా ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్..!
చిన్న వయస్సులో ఖగోళ శాస్త్రంపై పరిశోధనలు చేస్తున్న బాలిక పేరు పాళ్లెం సిద్ధిక్ష. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన బాలిక తల్లి డాక్టర్ చైతన్య విజయ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్‌గా.. తండ్రి విజయ్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్చేస్తున్నారు. వీరిద్దరు కుమార్తెలు ఖగోళశాస్త్రంపై పరిశోధనలు చేస్తూ గ్రహశకలాల జాడ చెబుతూ నాసా, ఇస్రోల ప్రశంసలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.
చిన్నకుమార్తె సిద్ధిక్ష.. అక్క శ్రీయ2018లో నాసా ఆధ్వర్యంలో జరిగిన "సైంటిస్ట్ ఫర్ డే" పోటీల్లో ప్రశంసాపత్రం అందుకున్నారు. నాటికి ఆరేళ్ల వయసున్న సిద్ధిక్ష అక్క నుంచి స్ఫూర్తి పొంది ఖగోళశాస్త్రంపై మక్కువ పెంచుకుంది. తల్లి గైడెన్స్‌లో ఖగోళ, అంతరిక్ష అంశాలపై దిల్లీల్లోని స్పేస్‌పోర్ట్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సమీర్ సచ్‌దేవా వద్ద శిక్షణ పొందింది. 2020లో నాసా "ఇంటర్నేషనల్ అబ్జర్వ్ ది మూన్ నైట్" పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరించింది. Spot
Siddhiksha From Hyderabad :2021లో సిద్ధిక్ష అక్కతో కలిసి IASC ఆధ్వర్యంలో జరిగిన ఆస్టెరాయిడ్ సెర్చ్ కాంపెయిన్లో 2021 GC103 గ్రహశకలాన్ని కనుగొని నాసా ధ్రువపత్రం సాధించింది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ ల్లో జరిగిన ఆస్టెరాయిడ్ సెర్చ్క్యాంపెన్లోనూపాన్ స్టార్స్ టెలిస్కోప్ ఫోటోల్ని విశ్లేషించి అంగారక , బృహస్పతి గ్రహాల మధ్య మెయిన్ బెల్డ్ ఆస్టెరాయిడ్లో ఓ గ్రహశకలాన్ని కనుగొంది సిద్ధిక్ష. దానికి 2022ఎస్డీ66 గా పేరు పెట్టారు. ఈ అక్టోబర్ 30న పారిస్‌లోని జరిగిన అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ యూనియన్, నాసా వరల్డ్ మైనర్ బాడీ కాటలాగ్లోనూ సిద్ధిక్ష భాగమైంది.
తండాలో పుట్టాడు.. గిరిజన సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు