Akanksha Vidyasagar Murder Case Update : ప్రియురాలిని హత్య చేసిఅదృశ్యమైన నిందితుడి జాడ కోసం.. బెంగళూరు పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. దిల్లీకి చెందిన అర్పిత్.. తన ప్రియురాలు హైదరాబాద్‌కు చెందిన ఆకాంక్ష విద్యాసాగర్‌ను ఈ నెల 5న హత్య చేసి పరారయ్యాడు. అప్పటి నుంచి కనిపించకుండాపోయిన నిందితుడు.. దేశం విడిచి వెళ్లకుండా జీవన్‌బీమా నగర పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
అసలు ఏం జరిగిందంటే..: హైదరాబాద్‌కు చెందిన ఆకాంక్ష విద్యాసాగర్ (23) బెంగళూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనిలో పని చేస్తుంది. ఆ సంస్థలోనే దిల్లీకి చెందిన అర్పిత్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కాగా కొన్ని నెలలుగా వీరిద్దరూ జీవన్‌బీమా నగర్ పరిధిలోని కోడిహళ్లిలో ఉన్న ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో కలిసి నివసిస్తున్నారు. ఇటీవలే అర్పిత్‌కు ప్రమోషన్ వచ్చింది. తాను ఆ పని మీద హైదరాబాద్ వెళ్లాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో విడిపోదామంటూ ఆకాంక్ష అర్పిత్‌తో గొడవ పడింది. ఇది నచ్చని అర్పిత్.. కోపానికి గురైఆకాంక్షను హత్య చేయాలని పథకం రచించాడు. తన ప్లాన్‌లో భాగంగా జూన్ 5వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చాడు.