అమెరికా మిచిగన్‌లోని లాన్సింగ్‌లో నివాసముంటున్న హైదరాబాద్‌కు చెందిన చరితారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ప్రమాదంలో ఆమె బ్రెయిన్‌డెడ్ అయినట్లు ముస్కేగాన్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న చరితారెడ్డి కారులో ప్రయాణిస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టడం వల్ల ఆమె తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లింది. ఈ ఘటనలో మరో ముగ్గురు కూడా గాయపడ్డారు.