తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇళ్లలో వరద నీళ్లు... ప్రజల గుండెనిండా కన్నీళ్లు - హైదరాబాద్​ వర్షాలు

హైదరాబాద్​లోని లోతట్టు కాలనీల్లో ముంపు కష్టాలు వీడటం లేదు. సరూర్‌నగర్‌లోని పలు కాలనీలు ఇంకా వరద గుప్పిట్లోనే కొనసాగుతున్నాయి. తగ్గిందనుకునేలోపే మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను ఆదుకునే వారు లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

hyderabad floods
hyderabad floods

By

Published : Oct 21, 2020, 1:52 PM IST

హైదరాబాద్​లో ఎడతెరిపిలేని వర్షాలకు వరద నుంచి లోతట్టు కాలనీలు కోలుకోవడలం లేదు. కొంతమేరకు వరద తగ్గుముఖం పడుతుండగానే నగరంలో వర్షాలు కురుస్తుండటం... స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. సరూర్​నగర్​లోని వివిధ కాలనీలు వరద గుప్పిట్లోనే కొనసాగుతున్నాయి.

జోరు వానలతో సరస్వతీనగర్, సింగరేణి కాలనీలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. వరద ఇళ్లలోకి చేరడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కష్టాల్లో ఉన్న తమను.. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ ఆదుకోవడం లేదని ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇళ్లలోనే నీళ్లున్నాయి... ఎట్లా ఉండేది!

ఇదీ చదవండి :హైదరాబాద్​లోని చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details