తెలంగాణ

telangana

ETV Bharat / state

వరదల్లో గుర్రాల స్వారీ... ప్రజలకు నిత్యావసరాల జారీ - టోలిచౌకిలోని పలు కాలనీలు జలదిగ్భంంధం

చూడగానే ఇదేంటి వీళ్లు నీళ్లలో గుర్రాల మీద స్వారీ చేస్తున్నారు అనుకుంటున్నారా! గుర్రాల రేసు కోర్టులో ఉండాల్సిన రైడర్లు కాలనీల్లో తిరుగుతున్నారేంటి అనుకుంటున్నారా! అవును ఇది నిజమే కానీ వారంతా స్వారీ చేయట్లేదు. హైదరాబాద్ వరదల్లో చిక్కుకున్న ప్రజలకు నిత్యావసరాలను అందిస్తున్నారు. టోలిచౌకిలోని వివిధ కాలనీల్లో ప్రజలు బయటికి రాలేని పరిస్థితుల్లో వినూత్న పద్ధతిలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు.

hyderabad flood people help to daily needs with Horses in tolichowki
వరదల్లో గుర్రాల స్వారీ...ప్రజలకు నిత్యావసరాల జారీ

By

Published : Oct 18, 2020, 11:40 AM IST

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఇళ్ల నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితుల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మరీ బయటికి రాకుండా నిత్యావసరాలు ఎలా తీసుకెళ్లాలి. అలాంటి వారి కోసం సహాయ బృందాలు వినూత్న రీతిలో సేవలు అందిస్తున్నారు.

టోలిచౌకిలోని పలు కాలనీల్లో మోకాల్లోతు నీళ్లలో గుర్రాల మీద స్వారీ చేస్తూ ప్రజలకు అవసరమైన పాలు, కూరగాయలు ఇంటింటికీ అందిస్తున్నారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి టోలిచౌకిలోని పలు కాలనీలు జలదిగ్భంంధంలో చిక్కుకున్నాయి. నదీమ్‌నగర్, బాల్‌రెడ్డినగర్, విరాసత్‌నగర్, నిజరా కాలనీల ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. వారి కోసం సహాయక సిబ్బంది ఇలా గుర్రాల ద్వారా వారికి నిత్యావసరాలను అందించారు.

వరదల్లో గుర్రాల స్వారీ...ప్రజలకు నిత్యావసరాల జారీ

ఇదీ చదవండి:కారు తీయాలంటే.. జేసీబీ రావాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details