తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో వచ్చిన ఫలితాలు లోక్​సభలో కూడా రిపీటైతే - ఆ పార్టీకి ఇబ్బందే! - హైదరాబాద్​లో భిన్నంగా వచ్చిన ఫలితాలు

Hyderabad Election Results 2023 : రాజధానిలో నగరంలో శాసనసభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, బీజేపీలకు భిన్నంగా వచ్చాయి. హైదరాబాద్​ నగరంలో సత్తా చాటాలని కాంగ్రెస్ భావించినప్పటికీ ఒక్కరూ గెలవలేదు. మూడు స్థానాల్లో కచ్చితంగా గెలుస్తామని బీజేపీ నేతలు అంచనాలు వేసినప్పటికీ, గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మినహా ఒక్క అభ్యర్థి కూడా విజయం సాధించలేదు.

Hyderabad Election Results 2023
Hyderabad Election Results

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2023, 3:12 PM IST

Hyderabad Election Results 2023 :హైదరాబాద్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌, బీజేపీల అంచనాలకు భిన్నంగా వచ్చాయి. రాజధాని నగరంలో సత్తా చాటుదామని కాంగ్రెస్‌ పార్టీ భావించినప్పటికీ ఒక్కరూ గెలవలేదు. ఖైరతాబాద్, సనత్​నగర్, అంబర్​పేట స్థానాల్లో కచ్చితంగా గెలుస్తామని బీజేపీ నేతలు అంచనాలు వేసినప్పటికీ, గోషామహల్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మినహా ఒక్క అభ్యర్థి విజయం సాధించలేదు. అలాగే రంగారెడ్డి, మేడ్చల్​లోనూ రెండుపార్టీలకు ఆశాజనకమైన ఫలితాలు రాలేదు.

ఇవే ఫలితాలు రిపీటైతే, బీఆర్​ఎస్​కి ఇబ్బందే : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇదే తరహా ఫలితాలొస్తే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు బీఆర్ఎస్​కు కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయి. రాజధాని పరిధిలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవేళ్ల, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. అయితే ఆయా నియోజవర్గాల్లోని శాసనసభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్​లకు వచ్చిన ఓట్ల శాతాన్ని ఓసారి పరిశీలిస్తే, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మినహా మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్‌ ఎంపీలు రేవంత్‌ రెడ్డి, రంజిత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి నియోజకవర్గాల పరిధుల్లో ఫలితాల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.

అంబర్‌పేట్‌, ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌ ఓకే :కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ముషీరాబాద్‌, సనత్​నగర్, అంబర్​పేట, జూబ్లీహిల్స్, నాంపల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలుండగా, అంబర్​పేట, సనత్​నగర్​లలో బీజేపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. అక్కడ బీజేపీకి వరుసగా 34.28, 23.75శాతం ఓట్లు లభించాయి. సికింద్రాబాద్, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు మూడోస్థానంలో నిలిచారు. ఆ స్థానాల్లో వారికి 24.71, 23.71, 14.13, 17.86 శాతం ఓట్లు వచ్చాయి. నాంపల్లి స్థానంలో నాలుగోస్థానంతో నిలిచారు.

సీఎం అభ్యర్థి ప్రకటనపై వీడని ఉత్కంఠ - మరింత ఆలస్యమయ్యే అవకాశం!

మేడ్చల్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి ఫర్వాలేదు :పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానంలో మేడ్చల్‌, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, కూకట్​పల్లి, కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గాల్లో ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్​లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మూడో స్థానంలో సరిపెట్టుకున్నారు. అక్కడ కాంగ్రెస్​కు పోలైన ఓట్లలో వారికి 28.58, 17.86, 25.62శాతం ఓట్లు వచ్చాయి. మేడ్చల్‌, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్​పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచినా, ఆ పార్టీ అభ్యర్థి 26.18 శాతం ఓట్లే తెచ్చుకున్నారు. మేడ్చల్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి స్థానాల్లో అక్కడ కాంగ్రెస్ పోలైన ఓట్లలో 38.45, 30.74, 28.58 శాతం ఓట్లు లభించాయి.

Telangana Assembly Election Results 2023 :రంజిత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న చేవెళ్ల లోక్‌సభ నియోజవర్గంలో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, మహేశ్వరం, వికారాబాద్, తాండూరు, పరిగి, చేవేళ్ల శాసనసభ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో ఆ ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుండగా, తాజా శాసనసభ ఎన్నికల్లో వికారాబాద్‌, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ పాస్‌ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నకల కంటే మెజారిటీ పెరిగింది. అక్కడ పోలైన ఓట్లలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు వరుసగా 49.87, 42.67, 40.21 శాతం ఓట్లు లభించాయి. కాగా, చేవేళ్ల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కేవలం 276 ఓట్లతో మాత్రమే గెలిచారు.

కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం - వారంలోనే జీహెచ్​ఎంసీకి కొత్త బాసులు!

కొత్తగా కొలువుదీరనున్న కేబినెట్ - మంత్రులుగా ఛాన్స్​ వీరికేనా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details