Hyderabad Drugs Case Update టాలీవుడ్లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. నిర్మాత వెంకట్ అరెస్టుతో వారిలో కలవరం Hyderabad Drugs Case Update :తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి డ్రగ్స్(Tollywood Drugs Case) కలకలం రేపింది. మాదకద్రవ్యాలు కొనుగోలు చేయడం, పార్టీలు నిర్వహించడం, డ్రగ్స్ విక్రయిస్తున్న కేసులో ప్రధాన నిందితుడు మాజీ నేవీ అధికారి బాలాజీ, సినీ ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డి, ఆర్పీఎఫ్ ఐజీ వద్ద సీనియర్ స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తున్న మురళిలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితుల ఫోన్లను పరిశీలించిన పోలీసులు.. వారు ఎవరికి కాల్స్ చేశారు. ఛాటింగ్, ఇతర కాల్స్ డేటా ఆధారంగా కొందరి పేర్లను గుర్తించినట్లు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా డ్రగ్ నెట్‌వర్క్‌లో కీలకపాత్ర పోషించే నైజీరియన్లతో వీరికి సంబంధాలు ఉన్నాయి.
డ్రగ్స్ కేసులో కీలక నిందితులు అరెస్టు.. కొకైన్ స్వాధీనం
Madhapur Drug Case : చాలాకాలంగా టాలీవుడ్‌లోని కొందరికి సరఫరా చేసినట్లు ప్రాథమిక నిర్ధారణ కావడంతో వారిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే చాలా మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన బాలాజీ సినీ పరిశ్రమలో ముఖ్యులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. మొత్తంగా 18 మంది వినియోగదారులకు కొకైన్, ఎక్స్టసీ మాత్రలు సరఫరా చేసినట్లు గుర్తించారు. వీరంతా ఎవరెవరో ప్రాథమికంగా ఒక జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. పట్టుబడిన నిందితుల ఫోన్లలోని సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తే.. ఇంకా ఎక్కువ మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
Kabali Producer Drugs Case Update : కేపీ చౌదరి డ్రగ్స్ కేసు.. 'టాలీవుడ్'లో టెన్షన్.. టెన్షన్..!
Hyderabad Rave Party Case :వెంకటరత్నా రెడ్డి(Film Producer in Rave Party), బాలాజీ డ్రగ్స్‌పార్టీలతో పాటు మరింత కిక్కునిచ్చేలా ఇతర రాష్ట్రాలకు చెందిన యువతుల్ని రప్పించేవారని సమాచారం. ఇలాంటి పార్టీలకు వచ్చేందుకు ఎక్కువ మంది ఇష్టపడేవారని పోలీసు అధికారులు చెబుతున్నారు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలని ఎదురుచూస్తున్న యువతులకు అవకాశాల వల వేసి వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్లు గుర్తించారు. తాజాగా వీరి అరెస్టుతో డ్రగ్స్ కొనుగోలు చేసిన కొందరు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే డ్రగ్స్ వ్యవహారాల్లో సినీ లింకులు బయటపడుతున్నా కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదని తీవ్ర ఆరోపణలున్నాయి.
Film Producer Arrested in Hyderabad Drugs Case : సినీ పరిశ్రమలోని వ్యక్తులకు రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల పరిచయాలతో ఈ తరహా కేసులు నీరుగారిపోతున్నట్లు విమర్శలున్నాయి. నిర్మాత కేపీ చౌదరి(Kabali Producer in Drugs Case) వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరి పేర్లతో జాబితా సిద్ధం చేశారు. అప్పట్లో తదుపరి దర్యాప్తునకు సిద్ధమైనా పైస్థాయి ఒత్తిడి కారణంగా ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గతంలోనూ ఇలానే టాలీవుడ్‌కు సంబంధించిన ప్రముఖ యాక్టర్లపై దర్యాప్తు ముమ్మరంగా జరిగింది. వారి అందరినీ పిలిచి విచారించారు.. కానీ ఇప్పటివరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో ఇప్పటికే పోలీసుల చర్యలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
Hyderabad SI Rajendra Drugs Case Update : డ్రగ్స్ కేసు అప్డేట్.. SI రాజేంద్ర కాల్‌డేటాలో అసలుగుట్టు
Drug Dealer Arrested At Hyderabad : పాపీ స్ట్రా డ్రగ్స్ సరఫరా.. స్కెచ్‌వేసి పట్టుకున్న ఎస్వోటీ పోలీసులు