Hyderabad Drugs Case Update :హైదరాబాద్ మాదాపూర్‌లోని విఠల్‌నగర్ ఫ్రెష్‌లివింగ్ అపార్ట్మెంట్ డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో బాలాజీ, వెంకటరత్నారెడ్డి, మురళీలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి సెల్‌ఫోన్, కాల్ డేటాలను, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. సినీ అవకాశాల పేరుతో అమ్మాయిలను, రేవ్‌పార్టీలతో ప్రముఖులకు ఎరవేసి మత్తుముఠా గుట్టుగా సాగించిన దందా గుట్టు.. రట్టు అయ్యింది.
Madhapur Drugs Case Latest Update :వీరి వద్ద సినీ(Tollywood in Hyderabad Drugs Case), రాజకీయ వర్గాలకు చెందిన పలువురి పేర్లు ఉన్నట్టు సమాచారం. బాలాజీ, వెంకటరత్నారెడ్డికి బెంగళూరులోని నైజీరియన్లతో పరిచయాలున్నాయి. వీరి ద్వారా కొకైన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీబ్లాట్స్ తదితర మాదకద్రవ్యాలు హైదరాబాద్‌కు తీసుకొచ్చి కొనుగోలుదారులకు చేరవేస్తున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. గతంలో పలుమార్లు పోలీసులు అరెస్ట్ చేసినా జైలు నుంచి బయటకురాగానే సిమ్‌కార్డులు మార్చి మళ్లీ కొత్తగా దందా సాగిస్తున్నారు.
Hyderabad Sub Inspector Drugs Case Update : ఖాకీ వనంలో డ్రగ్స్.. ఆ ముగ్గురిపై కూడా పోలీసుల ఫోకస్
Hyderabad Rave Party Case Update : ఇప్పటి వరకూ పోలీసులు ఈ కేసులో 24 మందిని నిందితులుగా చేర్చారు. ముగ్గురి వద్ద స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలో లభించే ఆధారాలు, కాల్‌డేటా, ఛాటింగ్ ఆధారంగా ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. డ్రగ్ పెడ్లర్స్, బెంగళూరులో కొనుగోలుదారులు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుల ఫోన్‌కాల్‌డేటా, వాట్సాప్ చాటింగ్స్‌లో వీరి పేర్లు గుర్తించారు. డ్రగ్స్ లావాదేవీల్లో అసలు పేరు బయటపడకుండా ‘నిక్ నేమ్’తో చలామణీ అవుతుండటంతో బయటపడుతున్న నిందితుల అసలు పేరు గుర్తించటం, వివరాలు రాబట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది.
Film Financier Venkat Crimes :పెద్దఎత్తున డ్రగ్స్ హైదరాబాద్‌కు చేరబోతుందనే పక్కా సమాచారంతో గుడిమల్కాపూర్ పోలీసులు, టీన్యాబ్ పోలీసులు (Telangana Anti Narcotics Bureau)అప్రమత్తమయ్యారు. ఆగస్టు 31 సాయంత్రం రేతిబౌలి క్రాస్‌రోడ్ వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన కాపా భాస్కర్ బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద కొకైన్, ఎక్సటసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. మత్తుపదారాలకు తాను అలవాటుపడినట్టు పోలీసుల ఎదుట భాస్కర్ వెల్లడించాడు. ఏ2 కారుమూరి వెంకటరత్నారెడ్డితో కలసి సర్వీస్ అపార్ట్‌మెంట్స్ అద్దెకు తీసుకొని తరచూ డ్రగ్‌పార్టీలు నిర్వహిస్తామని పోలీసులకు తెలిపాడు.
మాదాపూర్‌లోని ఫ్రెష్‌లింగ్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన డ్రగ్ పార్టీ కోసం అవసరమైన కొకైన్, ఎక్సటసీ పిల్స్‌ను కొనేందుకు కొద్దిరోజుల ముందు బెంగళూరు వెళ్లినట్టు చెప్పాడు. అక్కడి నైజీరియన్ ఇగ్వారే మైకేల్ నుంచి 26 ఎక్సటసీ పిల్స్, థామస్ అన్హా నుంచి కొకైన్ కొనుగోలు చేసినట్టు తెలిపాడు. మాదాపూర్ విఠల్‌రావునగర్‌లోని ఫ్రెష్‌లివింగ్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్ పార్టీ కోసం తీసుకెళ్తున్నట్టు పోలీసులకు నిందితుడు వివరించాడు.