Hyd DMHO on Omicron variant: హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల, భాషల ప్రజలు ఉంటారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా నగరంపై దృష్టి సారించింది. ప్రభుత్వ సూచనలు, ప్రణాళిక మేరకు వ్యాక్సినేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. దీంతో వ్యాక్సినేషన్‌ను 100 శాతానికి పైగా పూర్తి చేశాం. బూస్టర్ డోసు, చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్‌పై ఎలాంటి సందేహం వద్దు. ప్రణాళికకు అనుగుణంగా టీకా ప్రక్రియ పూర్తి చేస్తాం. విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా ఒమిక్రాన్ నిర్ధరణ అవుతోంది. స్థానికుల్లో ముగ్గురికి మాత్రమే వైరస్ సోకింది. వారిలో లక్షణాలు ఎక్కువగా కనిపించడం లేదు. బాధితులను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నాం. నగరంలో మూడో దశ ఉద్ధృతమైనా.. ముందస్తుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచాం. -డా. వెంకట్, హైదరాబాద్ డీఎమ్హెచ్ఓ
'ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి హైదరాబాద్ అన్ని విధాలుగా సన్నద్ధం' - corona cases in hyderabad
Hyd DMHO on Omicron variant: కరోనా టీకా తొలిడోస్ 110 శాతానికి మించి పంపిణీ చేసి రాష్ట్రంలోనే హైదరాబాద్ తొలిస్థానంలో నిలిచింది. నగరంలో ఇటీవల ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో... కొత్త వేరియంట్‌ను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హైదారాబాద్ డీఎమ్హెచ్ఓ డాక్టర్ వెంకట్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
!['ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి హైదరాబాద్ అన్ని విధాలుగా సన్నద్ధం' hyderabad top in vaccination](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14049079-97-14049079-1640852832721.jpg)
వ్యాక్సినేషన్లో హైదరాబాద్ టాప్
హైదరాబాద్ డీఎంహెచ్ఓతో ముఖాముఖి
Last Updated : Dec 30, 2021, 6:33 PM IST